
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంచనాలకు మించి రాణించిన భారత క్రీడాకారులు యూత్ ఒలింపిక్స్‌లో తమ పోరాటాన్ని రజత పతకంతో ముగించారు. పోటీల చివరిరోజు భారత్‌కు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆకాశ్ మలిక్ రజతాన్ని అందించాడు. హరియాణాకు చెందిన 15 ఏళ్ల ఆకాశ్ ఫైనల్లో 0–6తో ట్రెన్‌టన్ కౌలెస్ (అమెరికా) చేతిల ఓడిపోయాడు.
ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 13 పతకాలు సాధించి 17వ స్థానంలో నిలిచింది. 2010 క్రీడల్లో భారత్ 8 పతకాలతో 58వ స్థానంలో... 2014 క్రీడల్లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. 2022 యూత్ ఒలింపిక్స్ సెనెగల్‌లో జరుగుతాయి.