
పారిస్: ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఆంధ్రప్రదేశ్ మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో మెరిసింది. కాంపౌండ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్‌లో lవిజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 712 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రియా గుర్జర్ 689 పాయింట్లతో 20వ ర్యాంక్‌లో, ముస్కాన్ 689 పాయింట్లతో 21వ ర్యాంక్‌లో, అవనీత్ 686 పాయింట్లతో 24వ ర్యాంక్‌లో నిలిచారు. సురేఖ, ప్రియ, ముస్కాన్‌లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment