Archery World Cup Stage -3 Tournament
-
Archery World Cup: మెరిసిన జ్యోతి సురేఖ
పారిస్: ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఆంధ్రప్రదేశ్ మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో మెరిసింది. కాంపౌండ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో lవిజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 712 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రియా గుర్జర్ 689 పాయింట్లతో 20వ ర్యాంక్‌లో, ముస్కాన్ 689 పాయింట్లతో 21వ ర్యాంక్‌లో, అవనీత్ 686 పాయింట్లతో 24వ ర్యాంక్‌లో నిలిచారు. సురేఖ, ప్రియ, ముస్కాన్‌లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. -
రన్నరప్ భారత్
వ్రోక్లా (పోలండ్) : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెంట్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దీపిక కుమారి-మంగళ్ సింగ్ చాంపియా (భారత్) ద్వయం రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక-మంగళ్ సింగ్ జంట 1-5తో ఐదా రోమన్-యువాన్ సెరానో (మెక్సికో) జోడీ చేతిలో ఓడిపోయింది. తొలి సెట్లో రెండు జట్ల స్కోరు 36-36తో సమం కావడంతో ఒక్కో పాయింట్ దక్కింది. ఆ తర్వాత భారత జోడీ రెండో సెట్‌ను 35-37తో, మూడో సెట్‌ను 36-37తో కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది.