![Cm Ys Jagan Congratulates Indian Archer Jyothi Surekha - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/23/cm-ys-jagan3.jpg.webp?itok=JYqiZASH)
సాక్షి, తాడేపల్లి: భారత ఏస్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంను జ్యోతి సురేఖ బుధవారం కలిశారు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్, ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో పలు పతకాలను ఆమె సాధించారు.
తాను సాధించిన పతకాలను సీఎంకు సురేఖ చూపించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తి చాటడంపై సురేఖను సీఎం ప్రశంసించారు. తనకు డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం.. రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఏపీకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.
చదవండి: కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో తొలిస్థానంలో ఏపీ: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment