Indian Archer
-
శెభాష్.. రెండు చేతుల్లేకపోయినా.. రెండు స్వర్ణాలు.. శీతల్ సరికొత్త చరిత్ర
హాంగ్జౌ: తన వైకల్యమే కుంగిపోయేలా... ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా భారత క్రీడాకారిణి శీతల్ దేవి ఆసియా పారా క్రీడల్లో పతకాల ‘హ్యాట్రిక్’ సాధించింది. కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల ఈ టీనేజ్ ఆర్చర్‌కు రెండు చేతులు భుజాల నుంచే లేవు. మరి రెండు చేతులు తప్పక కావాల్సిన విలువిద్యలో ఆమె పతకాలపై గురిపెట్టడం ఏంటని ఆశ్చర్యం కలుగకమానదు. శీతల్ కాళ్లతో విల్లును నిటారుగా నిలబెట్టి, నోటితో బాణాన్ని లాగిపట్టి... లక్ష్యంపై గురిపెట్టే ఆమె ప్రావీణ్యానికి జేజేలు పలకాల్సిందే! ఆమె ప్రదర్శన ముందు వైకల్యం పూర్తిగా ఓడిపోయింది. ఈ ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో ఆమె ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇంతకుముందు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజతం నెగ్గిన ఆమె రాకేశ్ కుమార్‌తో కలిసి గురువారం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. శుక్రవారం జరిగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి 144–142తో అలీమ్ నూర్ సియాదా (సింగపూర్)పై గెలిచింది. తద్వారా ఒకే ఆసియా పారా ఈవెంట్లో రెండు బంగారు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ఇదే ఈవెంట్లో అంకుర్ రెండు స్వర్ణాలతో పురుష అథ్లెట్‌గా నిలిచాడు. శుక్రవారం పారాలింపిక్ చాంపియన్ అయిన షట్లర్ ప్రమోద్ భగత్, మహిళల్లో తులస్మతి మురుగేశన్, పురుషుల డబుల్స్‌లో నితేశ్–తరుణ్ జోడీ బంగారు పతకాలు సాధించారు. ఒక్క బ్యాడ్మింటన్‌లోనే భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరడం విశేషం. కాగా శనివారం ముగిసిన ఈ క్రీడల్లో భారత్ 111 పతకాలు కైవసం చేసుకుని తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఇందులో 29 పసిడి, 31 రజతాలు, 51 కాంస్యాలున్నాయి. ఇక ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా పారా క్రీడల్లో ఐదో స్థానం సంపాదించింది. Here is the inspirational story of Sheetal Devi. She is crowned as Asian Para games champion. This old video was by @thebeingyou. Watch to believe. pic.twitter.com/Fskqj09tdn — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 27, 2023 -
భారత ఏస్ ఆర్చర్ జ్యోతి సురేఖకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత ఏస్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంను జ్యోతి సురేఖ బుధవారం కలిశారు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్, ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో పలు పతకాలను ఆమె సాధించారు. తాను సాధించిన పతకాలను సీఎంకు సురేఖ చూపించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తి చాటడంపై సురేఖను సీఎం ప్రశంసించారు. తనకు డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం.. రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఏపీకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. చదవండి: కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో తొలిస్థానంలో ఏపీ: సీఎం జగన్ -
పార్థ్ సాలుంకే ‘స్వర్ణ’ చరిత్ర
లిమెరిక్ (ఐర్లాండ్): భారత ఆర్చరీ ప్లేయర్ పార్థ్ సాలుంకే ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో పసిడి చరిత్ర లిఖించాడు. ఈ టోర్నమెంట్లో అతను పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచాడు. మొత్తంమీద ఈ పోటీల్లో భారత బృందం మునుపెన్నడు లేని విధంగా ఈ టోర్నీలోనే అత్యధికంగా 11 పతకాలు సాధించిన జట్టుగా నిలిచింది. అండర్ –21 పురుషుల వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల సాలుంకే... ఆర్చరీలో ఘనాపాటిలైన కొరియన్‌ను కంగుతినిపించాడు. ఫైనల్లో పార్థ్ 7–3తో ఏడో సీడ్ సంగ్ ఇంజున్ను ఓడించాడు. ప్రత్యేకించి పురుషుల రికర్వ్‌లో బంగారు పతకం సాధించిన తొలి ఆర్చర్‌గా పార్థ్ సాలుంకే ఘనత వహించాడు. మహిళల రికర్వ్‌లో ఇదివరకే దీపిక కుమారి (2009, 2011), కొమలిక బారి (2019, 2021) బంగారు పతకాలు సాధించారు. మహిళల అండర్–21 వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో భారత్ ఖాతాలో కాంస్యం చేరింది. భజన్ కౌర్ 7–1తో చైనీస్ తైపీకి చెందిన సు సిన్ యూపై నెగ్గింది. Parth Salunkhe's PURE DETERMINATION. 👏 India has the new 2023 World Archery Youth Champion. 🇮🇳🇮🇳🇮🇳#WorldArchery pic.twitter.com/rTDPYDCDBA — World Archery (@worldarchery) July 9, 2023 చదవండి: #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు! -
అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..!
వెదురుతో చేసిన విల్లు, బాణాలు.. అడవిలో సరదాగా పోటీలు.. చెట్టుకు కట్టిన మూటను సరిగ్గా గురి చూసి కొడితే బహుమతిగా బెల్లం..15 ఏళ్ల వయసు వచ్చే సరికి కూడా అతనికి అదే జీవితం.. ఏనాడూ అతను తన విలువిద్యతో ఊరు దాటగలనని, అంతర్జాతీయ స్థాయికి చేరగలనని ఊహించలేదు. కానీ ఆ కుర్రాడి అపార ప్రతిభకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. దొరికిన అరుదైన అవకాశాన్ని ఒడుపుగా అంది పుచ్చుకున్న అతను తన తరంలో ఆర్చరీ క్రీడకు ఏకైక చిరునామాగా నిలిచాడు. సరైన మార్గనిర్దేశనంతో అతను ఏకంగా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాడు. మన దేశంలో ఆర్చరీ అప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో టార్చ్ బేరర్‌గా మారి తర్వాతి రోజుల్లో భారత్‌లో ఆర్చరీ అభివృద్ధికి ఒక ఆటగాడిగా దారి చూపించాడు. ఒక దశలో ఆ క్రీడలో అతని పేరు మినహా ఇంకెవరినీ.. సాధారణ క్రీడాభిమాని గుర్తు పట్టలేని స్థాయికి చేరిన ఆ వ్యక్తి లింబా రామ్. అతిసాధారణ గిరిజన నేపథ్యం నుంచి ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు పొందిన ఆర్చర్. 1987.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి బియ్యాల పాపారావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ‘సాయ్’లో వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ‘సాయ్’లో ఒక రకమైన ప్రత్యేక టైమ్‌టేబుల్‌తో పాటు అక్కడ శిక్షణ కోసం ఎంపికయ్యేందుకు దాదాపు ఒకే తరహా పద్ధతిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనేది పాపారావు ఆలోచన. సహజ ప్రతిభను వెలుగులోకి తెచ్చి తగిన రీతిలో శిక్షణ ఇస్తే సాధారణ నేపథ్యం ఉన్నవారు కూడా సత్తా చాటగలరనేది ఆయన నమ్మకం. అందుకే ఆయన దృష్టి్ట గిరి పుత్రులపై పడింది. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్‌కి చెందిన వ్యక్తి కావడంతో వారి గురించి ఆయనకు అవగాహన ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ‘స్పెషల్ ఏరియా గేమ్స్’ పేరుతో కొత్త తరహా సెలక్షన్స్‌కి శ్రీకారం చుట్టారు. ఆర్చరీలో కూడా ఇదే తరహాలో సెలక్షన్స్ జరిగాయి. అప్పటి వరకు అడవిలో విల్లు, బాణాలతో వేటకే పరిమితమైనవారికి ఇలా ఓపెన్ సెలక్షన్స్ ద్వారా అవకాశం లభించింది. కొందరు మిత్రులు ఇచ్చిన సమాచారంతో లింబా రామ్ కూడా దీనికి హాజరయ్యాడు. అతనిలోని సహజ ప్రతిభను అధికారులు గుర్తించి వెంటనే ఎంపిక చేశారు. అక్కడినుంచి లింబా రామ్ ప్రయాణం ఢిల్లీలోని ‘సాయ్’ కేంద్రానికి సాగింది. అది ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు చేరింది. అడవి బిడ్డ నుంచి ఆర్చర్‌గా.. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లా సరాదీత్ గ్రామం లింబా రామ్ స్వస్థలం. ఐదుగురు సంతానంలో అతనొకడు కాగా, తండ్రి వ్యవసాయ కూలీ. వారి కుటుంబం ‘అహారి’ అనే గిరిజన తెగకు చెందింది. పేదరికం కారణంగా లింబా రామ్.. తన సోదరుల్లాగే కూలీ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. స్నేహితులతో కలసి సరదాగా వేటకు కూడా వెళ్లేవాడు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ‘అర్జున్ రామ్’ అనే పేరు పెట్టారు. అయితే చిన్న వయసులో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైన అతను దాదాపు మృత్యువుకు చేరువగా వెళ్లాడు. అదృష్టవశాత్తు కోలుకోవడంతో అర్జున్ అనే పేరు తీసేసి స్థానిక దేవత పేరు మీద ‘లింబా’ అని చేర్చారు. అలా ఆ పేరులోంచి అర్జునుడు పోయినా.. ఆ తర్వాత భవిష్యత్తులో అతను అభినవ అర్జునుడిలా బాణాలు సంధిస్తూ విలువిద్యలో నేర్పరి కావడం దైవానుగ్రహమే కావచ్చు! వెదురు బాణాలతో వేటాడటం, స్థానికంగా కొన్ని పోటీల్లో పాల్గొనడం మినహా ఆర్చరీ అనే ఒక అధికారిక క్రీడ ఉందని, అందులో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చనే విషయం అప్పటికి లింబా రామ్‌కి అసలు తెలీదు. అయితే ‘సాయ్’ సెలక్షన్స్ అన్నీ మార్చేశాయి. సరైన చోట, సరైన శిక్షణతో.. స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో కొత్త విద్యార్థిగా చేరిన లింబా రామ్‌కి అక్కడి ప్రపంచం అంతా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వెదురు విల్లుకే పరిమితమైన అతని చేతికి తొలిసారి ఆధునిక విల్లు, బాణాలు వచ్చాయి. భారత కోచ్ ఆరెస్ సోధీ పర్యవేక్షణలో శిక్షణ మొదలైంది. రష్యా కోచ్ అలెగ్జాండర్ నికొలయ్ జట్టుకి కోచ్‌గా కొత్త తరహా శిక్షణ కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ‘నువ్వు ఈ ఆట కోసమే పుట్టావురా’ అంటూ సోధీ చెప్పిన మాట లింబా రామ్‌లో స్ఫూర్తి నింపి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ ఎంపికకు కారణమైన పాపారావు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లింబా రామ్‌ని ప్రోత్సహించారు. దాని ఫలితాలు కొన్ని నెలలకే కనిపించాయి. బెంగళూరులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో విజేతగా నిలవడంతో లింబా రామ్‌పై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాతా అదే జోరును కొనసాగించిన అతను సంవత్సరం తిరిగే లోపే జాతీయ స్థాయి సీనియర్ చాంపియన్‌గా కూడా మారాడు. దాంతో 16 ఏళ్ల వయసులోనే భారత ఆర్చరీ టీమ్‌లో లింబా రామ్‌కి చోటు దక్కింది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు భారత ఆర్చరీపై తనదైన ముద్ర వేసిన అతను ఎన్నో ఘనతలను తన ఖాతాలో లిఖించుకున్నాడు. ప్రపంచ రికార్డు కూడా.. 1989లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్ షిప్ తొలిసారి లింబా రామ్‌కి అంతర్జాతీయ వేదికపై గుర్తింపును అందించింది. ఈ ఈవెంట్లో అతను క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆసియన్ కప్‌లో చక్కటి ప్రదర్శనతో లింబా ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు టీమ్ ఈవెంట్లో భారత్‌కి రజతం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాతి ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కి నాలుగో స్థానం దక్కడంలో అతనిదే ప్రధాన భూమిక. మరో రెండేళ్ల తర్వాత జరిగిన ఆసియన్ ఆర్చరీ చాంపియన్ షిప్ లింబా రామ్ కెరీర్లో అత్యుత్తమ దశ. బీజింగ్‌లో జరిగిన ఈ పోటీల వ్యక్తిగత విభాగంలో అతను స్వర్ణం సాధించడంతో పాటు 358/360 స్కోరుతో అప్పటి ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. 1995లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ఆర్చరీ చాంపియన్ షిప్లో కూడా అతను ఒక స్వర్ణం, ఒక రజతంతో మెరిశాడు. కెరీర్ చివర్లో కుర్రాళ్ల మధ్య మరోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచి లింబా తన ఆటను ముగించాడు. అచ్చిరాని మెగా ఈవెంట్.. ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఒలింపిక్స్ పతకం సాధించడం ఒక కల. లింబా రామ్‌కి వరుసగా మూడు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చినా పతకం మాత్రం దక్కలేదు. ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు తెచ్చుకున్నా, మూడుసార్లూ నిరాశే ఎదురైంది. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఆడినా.. అందులో అతని అనుభవరాహిత్యం కనిపించింది. 1992 బార్సిలోనా సమయంలోనైతే అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. తాజా వరల్డ్ రికార్డుతో అతనిపై మంచి అంచనాలూ ఉన్నాయి. తనపై మెడల్ గురించి ఉన్న ఒత్తిడిని అతను అధిగమించలేకపోయాడు. ‘నువ్వు పతకం గెలవడం ఖాయం. ఇక్కడి నుంచే మెడలో పతకంతో తీసుకెళ్లి భారత్‌లో మా భుజాలపై ఊరేగిస్తాం’ అంటూ ఫెడరేషన్ అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. చివరకు అక్కడ నిరాశే ఎదురైంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో కూడా ఆటగాడిగా మెరుగైన స్థితిలోనే ఉన్నా.. ఒలింపిక్స్ కొద్ది రోజుల ముందు ఫుట్‌బాల్ ఆడుతున్న అతని భుజానికి తీవ్ర గాయమైంది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. లింబా రామ్ ఘనతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో అతనిని గౌరవించింది. ఈతరం ఆధునిక ఆటగాళ్ల ప్రదర్శనలతో పోలిస్తే లింబా రామ్ సాధించిన విజయాలు తక్కువగా అనిపించవచ్చు. కానీ భారత్‌లో ఆర్చరీకి గుర్తింపు తెచ్చి కొత్త బాట చూపించినవాడిగా అతని పేరు ఎప్పటికీ నిలిచిపోంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
జ్యోతి సురేఖను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : భారత ఆర్చర్, అర్జున పురస్కార గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మంగళవారం జ్యోతి సురేఖ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జ్యోతి సరేఖను సీఎం వైఎస్ జగన్ శాలువతో సత్కరించారు. జ్యోతి సురేఖ తాను సాధించిన పతకాలను సీఎం వైఎస్ జగన్‌కు చూపించారు. జ్యోతి సురేఖ వెంట మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు. కాగా, జ్యోతి సురేఖ ఆర్చరీలో కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో, ఈ ఏడాది జూన్‌లో జరిగిన 50వ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. -
'విజయవాడలో ఆమెకు 500 గజాల స్థలం'
అమరావతి: అర్జున అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిందు చేతుల మీదుగా జాతీయ క్రీడాపురస్కారం అర్జున అవార్డు అందుకున్నందుకు ఆమెను సీఎం అభినందించారు. జ్యోతి సురేఖకు విజయవాడలో 500 గజాల స్థలం, కోటి రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీయిచ్చారు. ఆమె పేరును ప్రభుత్వ ఉద్యోగానికి పేరు సిఫారసు చేస్తామన్నారు. స్కేటింగ్‌లో గిన్నీస్ రికార్డు సాధించిన జి.దేవిశ్రీప్రసాద్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. అతడికి ముఖ్యమంత్రి 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. దేవిశ్రీప్రసాద్ శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని, తిరుపతి ఎస్వీయూలో స్కేటింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీయిచ్చారు. -
అభిషేక్‌కు స్వర్ణం
వ్రోక్లా (పోలండ్) : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెం ట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అభిషేక్ 148-145 పాయింట్ల తేడాతో ఇస్మాయిల్ ఇబాది (ఇరాన్)పై గెలిచాడు. అయితే కాం పౌండ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు నిరాశ మిగిలింది. కాం స్య పతక పోరులో అభిషేక్, కవల్‌ప్రీత్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత్ 230-233 తేడాతో ఇటలీ చేతిలో ఓడింది.