ప్రియమైన ప్రధాని గారు.. చిన్నారి అదితి లేఖ! | Class 6 student Aditi from Kanpur who wrote to PM Modi | Sakshi
Sakshi News home page

ప్రియమైన ప్రధాని గారు.. చిన్నారి అదితి లేఖ!

Published Sun, Apr 17 2016 3:10 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

ప్రియమైన ప్రధాని గారు.. చిన్నారి అదితి లేఖ! - Sakshi

ప్రియమైన ప్రధాని గారు.. చిన్నారి అదితి లేఖ!

కాన్పూర్‌: చిన్నారులు కూడా దేశ రాజకీయాలు, అభివృద్ధిపై ఆసక్తి చూపిస్తున్నారనడానికి నిదర్శనం ఈ ఘటన. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆరో తరగతి చదువుతున్న అదితి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. మోదీ ప్రభుత్వం పనితీరుపై ఈ చిన్నారి ప్రశంసల జల్లు కురిపింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విశిష్టమైన పథకాలు అదితిని లేఖ రాసేలా కదిలించాయి.

మోదీ సర్కార్‌ను కొనియాడుతూ హిందీలో చేతిరాతతో ఆమె లేఖను ప్రధాని చిరునామకు పంపింది. ఈ లేఖకు బదులు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బదులు రావడం అదితిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 'థాంక్యూ' అంటూ పీఎంవో నుంచి ప్రత్యుత్తరం రావడంతో ఇప్పుడు అదితి ఆనందంలో మునిగిపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement