అదితి మ్యాకాల్ పుట్టింది కామారెడ్డి. తండ్రి సదాశివపేట గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకొని, పలు ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్ నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఫ్యాషన్‌పై ఉన్న మక్కువతో తన డిజైన్స్‌ను తానే ధరిస్తూ కొన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొంది. డిజైనర్‌గా కంటే మోడల్‌గా గుర్తింపు రావడంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తర్వాత ఆమె నటనారంగం వైపు నడిచింది.
వాణిజ్య ప్రకటనల్లో మోడలింగ్ చేస్తూ.. యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించేది. తను నటించిన ‘పాప పి సుశీల’, ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘పాష్ పోరీస్’ వెబ్ సిరీస్‌లు అదితికి సినిమా ఛాన్స్‌లను తెచ్చి పెట్టాయి. బ్లాక్‌బాస్టర్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అదితి వెనుతిరిగి చూడలేదు. అందులో చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి గుర్తింపునే ఇచ్చింది. వరుసగా ‘అమీ తుమీ’,‘రాధ’, ‘మిఠాయ్’, ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’, ‘నేనులేని నా ప్రేమకథ’ సినిమాల్లో నటించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఏకమ్’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
బిజీగా ఉండటం నాకిష్టం. ఎంతలా అంటే ఐదేళ్లలో ఇరవై సినిమాల్లో నటించేంతలా! బాలీవుడ్‌లోనూ నటించాలని ఉంది
– అదితి మ్యాకాల్
చదవండి: రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం
Comments
Please login to add a commentAdd a comment