బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ బ్యూటీ | Akshara Gowda Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

Akshara Gowda: తల్లిని అయినట్లు నటి పోస్ట్.. ఫొటో వైరల్

Published Sat, Dec 7 2024 3:47 PM | Last Updated on Sat, Dec 7 2024 3:58 PM

Akshara Gowda Blessed With Baby Boy

తెలుగులో పలు సినిమాల్లో నటించిన అక్షర గౌడ తల్లయింది. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం ఈమెకు ఆకాశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబరులో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు బిడ్డ పుట్టినట్లు పోస్ట్ పెట్టింది. దీంతో తోటి నటీనటులు ఈమెకు విషెస్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!)

బెంగళూరులో పుట్టి పెరిగిన అక్షర గౌడ.. 2011 నుంచి ఇండస్ట్రీలో ఉంది. తొలుత హిందీ, తమిళంలో సినిమాలు చేసింది. 2018లో మాతృభాషలో కన్నడలో నటించింది. ఆ తర్వాత తెలుగులోనూ మన్మథుడు 2, ద వారియర్, దాస్ క దమ్కీ, హరోంహర, 'నేనే నా' తదితర చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ఇప్పుడు బిడ్డ పుట్టిన విషయాన్ని ప్రకటించిన అక్షర గౌడ.. తాను బేబీ బంప్‌తో ఉన్న ఫొటోల్ని కూడా పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement