Akshara Gowda
-
నో డూప్
ఓ మిస్టరీని ఛేదించడాని సిద్ధమయ్యారు రెజీనా. మరి ఆ ప్రయాణంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తెలియడానికి ఇంకా సమయం ఉంది. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించారు రెజీనా. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌శేఖర్ వర్మ నిర్మించనున్నారు. తమిళనాడులో చిత్రీకరణ కూడా ప్రారంభించారు చిత్రబృందం. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉండబోతోందట. రెజీనా డూప్ లేకుండా ఫైట్స్ చేయనున్నారని సమాచారం. ఇందుకోసం శిక్షణ కూడా ప్రారంభించారట. -
జ్యోతిష్యం చెబుతా
చేతిని చూసి మీకు జరగబోయేదేంటో జోష్యం చెబుతాను అంటున్నారు రెజీనా. అనడమే కాదు.. జోష్యానికి సంబంధించిన విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటున్నారు. ఇదంతా తన తదుపరి సినిమాలోని పాత్రకు సంబంధించిన ప్రాక్టీస్ అని అర్థం చేసుకోవచ్చు. ‘ఎవరు’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రెజీనా. ఇటీవలే తమిళంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను అంగీకరించారు. ఇందులో అక్షర గౌడ మరో హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ సినిమాలో చూపించనున్నారట. ‘‘ఈ సినిమాలో నేను జ్యోతిష్కురాలి పాత్రలో కనిపిస్తాను. డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పాగానే బాగా కనెక్ట్ అయ్యాను’’ అని పేర్కొన్నారు రెజీనా. జనవరి 10 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. -
ఎంజీఆర్‌తో ఢీ
తమిళసినిమా: లెజెండరీ యాక్టర్, చరిత్రకారుడు ఎంజీఆర్‌తో కలిసి నటించే అవకాశం కోసం అప్పట్లో చాలా మంది ఎదురుచూసి ఉంటారు. అలాంటి వారిలో అతి కొద్దిమందికే ఆయనతో నటించే అవకాశం లభించి ఉంటుంది. చాలా మందికి అది కలగానే మిగిలిపోయి ఉంటుంది. అలాంటిది ఎంజీఆర్ జీవించి లేకపోయినా ఆయనతో నటించే లక్కీ ఛాన్స్‌ను నటి అక్షరగౌడ్ అందుకుంది. అదేంటని ఆశ్చర్య పోతున్నారా. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమే. ఎంజీఆర్ ఉలగం చుట్రుమ్ వాలిభన్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ చేయాలని భావించినా, ఆయన రాజకీయాల్లో బిజీ కావడంతో అది జరగలేదు. అయితే ఎంజీఆర్ ఉలగం చుట్రుమ్ వాలిభన్ చిత్రానికి సీక్వెల్ తాజాగా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు పేరుతో తెరరూపం దాల్చుతోంది. ఇది కొంత భాగం యానిమేషన్‌లోనూ మరి కొంత భాగం నటీనటులు నటించే విధంగానూ రూపొందుతోంది. ఎంజీఆర్, జయలలిత, నాగేశ్ వంటి పాత్రలు యానిమేషన్‌లోనూ ఇతర పాత్రలు నేరుగానూ ఉంటాయట. ఇందులో ఎంజీఆర్‌కు ప్రతినాయకిగా అక్షరగౌడ్ను ఎంపిక చేశారు. ఈ అమ్మడు ఇంతకుముందు ఉయిర్‌తిరు 420, తుపాకీ, ఆరంభం, ఇరుంబు కుదిరై, బోగన్ చిత్రాల్లో గ్లామరస్ విలనీయాన్ని ప్రదర్శించారు. కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రంలో ఎంజీఆర్ ఆఫ్రికా వెళ్లినప్పుడు అక్కడ ఆయనతో ప్రతినాయకిగా అక్షరగౌడ్ ఢీకొంటారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. -
పోలీస్ అధికారిణిగా అక్షరాగౌడ
తమిళసినిమా: బోగన్ చిత్రం ఫేమ్ అక్షరాగౌడ గుర్తుందా? అంతకు ముందు తుపాకీ, చిత్రంలో కూడా గెస్ట్‌గా మెరిసింది. బెంగళూర్‌కు చెందిన ఈ బ్యూటీ అందాలను ఆరబోయటానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పదని తన చిత్రాలు చూసిన వారికి అర్ధం అవుతుంది. అజిత్ హీరోగా నటించిన ఆరంభం చిత్రంలో ఈత దుస్తుల్లోనూ తడి తడి అందాలతో అలరించింది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన అక్షరాగౌడ హిందీ చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం మాతృభాషలో నటిస్తున్న అక్షరాగౌడ తమిళంలో ముఖ్య పాత్రలో నటించిన మాయవన్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో హీరోయిన్గా అవకాశం వచ్చింది. వర్తమాన నటుడు ధృవరాజకు జంటగా నటించడానికి రెడీ అవుతోంది. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన పర్కో మెగా ఫోన్ పడుతున్న ఈ చిత్రానికి మీరినాల్ దండిక్కపడువీర్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది కుట్రం–23 చిత్రం తరహాలో క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అట. ఇందులో హీరో, హీరోయిన్లిద్దరూ అసిస్టెంట్ కమిషనర్లుగా నటించనున్నారు. చిత్రంలో హీరో ధృవరాజ్‌తో పాటు నటి అక్షరాగౌడకు కూడా భారీగానే యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయట. ధరణ్ సంగీత భాణీలు కడుతున్న ఈ చిత్రానికి వెంకటేశ్ ఛాయాగ్రహణను అందించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈ వారం చివర్లో ప్రారంభం కానుంది.