జాడలేని అదితి | ongoing search efforts | Sakshi
Sakshi News home page

జాడలేని అదితి

Published Fri, Sep 25 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

జాడలేని అదితి

జాడలేని అదితి

కొనసాగుతున్న గాలింపు చర్యలు
గజఈతగాళ్లు దిగినా చిక్కని ఆచూకీ
మంత్రి గంటా.. కమిషనర్ సందర్శన
{yెయినేజీలపై ఆదరాబాదరాగా సిమెంటు పలకల తొలగింపు

 
మద్దిలపాలెం(విశాఖ): ఆరేళ్ల అదితి ఆచూకీ తెలియలేదు. ఏక్షణం ఏ కబురు వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనగా నిరీక్షిస్తున్నారు. మద్దిలపాలెంలో గురువారం సాయంత్రం ట్యూషనుకు వెళ్లిన చిన్నారి అదితి వర్షపునీటి ఉధృతికి మురుగుకాలువలో పడి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. స్థానికులు గురువారం రాత్రి కాలువలన్నీ వెతికినా ఫలితం కనిపించలేదు. ఆలస్యంగా స్పందించిన జీవీఎంసీ సిబ్బంది కూడా బాలిక అన్వేషణలో పడ్డారు. మద్దిలపాలెం మొదలుకుని ఎంవీపీ కాలనీవరకూ డ్రెయినేజీ వ్యవస్థను జల్లెడ పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎంవీపీ కాలనీలో గెడ్డలో గజ ఈతగాళ్ల బృందం మూడుసార్లు దిగినా ఫలితం కనిపించలేదు.

సందర్శించిన గంటా..కమిషనర్
జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రయినేజి కాలువలపై ఆక్రమణల ఫలితంగానే బాలిక అన్వేషణ జఠిలమైందని గుర్తించారు. మద్దిలపాలెం పరిసరాల్లో డ్రయినేజీలపై ఉన్న సిమెంట్ దిమ్మలను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.గెడ్డకు అనుసంధానంగా ఉన్న కొన్ని మ్యాన్‌హోల్స్‌ను కూడ తొలగించారు. నగరంలో  2వేల మీటర్ల మేర పెద్ద గెడ్డలు, 4వేల మీటర్ల చిన్నగెడ్డలు ఉన్నాయని వీటిలో చాలా వరకు ఆక్రమణలకు గురయిన విషయం వాస్తవమేనని కమిషనరు చెప్పుకొచ్చారు. నగరం వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర బింధువుగా మారుతున్న నేపథ్యంలో ఇటువంటివి సహజమేనన్నారు. ఈ వ్యవస్థ మొత్తం ప్రక్షాలనకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందన్నారు.

మధ్యాహ్నం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గెడ్డలు, డ్రైనేజీ ఆక్రమణలు పరిశీలించారు. జీవీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల 3.7 కిలోమీటర్ల మేర గెడ్డ ఆధునీకరణ పనులు చేపట్టడంతో నీరు నేరుగా ప్రవహిస్తూ  సముద్ర జలాల్లోకి కలిసిపోతుందని, దీనికారణంగా చిన్నారి ఆచూకి తెలుసుకోవడం కష్టంగా మారిందని కమిషనర్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు వివరించారు.

విస్తృతంగా గాలించండి: నారాయణ: చిన్నారి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధిశాఖామంత్రి డాక్టర్ పి.వి.నారాయణ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. బాలిక ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలతోపాటు నేవీ అధికారుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.

తల్లికి తెలియనివ్వకుండా.. అదితి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం సీతమ్మధార చేరుకున్నారు. అదితికి ఆరోగ్యంబాగాలేక ఆసుపత్రిలో చేర్పించామని బాలిక తల్లికి కు టుంబ సభ్యులు చెప్పారు. ఆమె కు గల్లంతు విషయం తెలియకుం డా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. గుండెల్లో విషాదం దాచుకుని గుంభనంగా తిరుగుతున్నా రు. ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం అలముకుంది.  బాలిక తండ్రి శ్రీనివాసరావుసంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పాప కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘మా ముద్దుల బిడ్డ దోరుకుంతుందని భగవంతుడుని వేడుకుంటున్నాను. నా స్నేహితులు..స్థానికులు అన్నదమ్ముళ్లులా రాత్రి నుంచి గాలిస్తున్నారు. ఇద్దరు బాబుల తరువాత పాప పుట్టింది. నిత్యం ఫోన్లో మాట్లాడేది అంటూ కన్నీరు మున్నీరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement