Search activities
-
టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
నవీపేట(బోధన్): ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం మెరుపు దాడి చేసి, రెండు టిప్పర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం వేకువజామున నాళేశ్వర్ నుంచి నిజామాబాద్‌కు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మండలంలోని జన్నెపల్లి, నాళేశ్వర్, శాఖాపూర్, చిక్లి వాగుల నుంచి కొందరు ఇసుకాసురులు రాత్రి వేళల్లో నిజామాబాద్, ఆర్మూర్, నందిపేట, నవీపేటలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని రెవెన్యూ, పోలీసులకు వివిధ గ్రామాల రైతులు, యువకులు పలుమార్లు ఫోన్లో ఫిర్యాదులు చేశారు. అయితే, వారు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారని కొందరు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు పగడ్బందీగా దాడులు చేయాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. ఇసుక రవాణాలో ముదుర్లుగా పేరున్న గాంధీనగర్, చిక్లి క్యాంప్‌లకు చెందిన ఇరువురు ఎప్పటిలాగే నాళేశ్వర్ వాగు నుంచి నిజామాబాద్ వైపు రెండు టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. పథకం ప్రకారం నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ వాహనాలను వెంబడించి పాల్దా సమీపంలో పట్టుకున్నారు. ఈ రెండు వాహనాలకు రక్షణగా ఉన్న కారును కూడా సీజ్ చేశారు. టిప్పర్లతో పాటు కారును స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
మదన్ కోసం ప్రత్యేక బృందాలు
తమిళసినిమా: వేందర్ మూవీస్ నిర్మాత మదన్ కోసం పోలీసు ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో మెడికల్ సీట్ ఇప్పిస్తానని వారి తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఇతను నిందితుడు. గత నెల 27న ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుంచి అతని జాడ తెలియరాలేదు. అయితే ఆయనపై కేసుల పరంపర కొనసాగుతోంది. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో కేంద్ర నేరపరిశోధన శాఖ అడిషనల్ డిప్యూటీ డెరైక్టర్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఒక బృందం వారణాసి, మరో మూడు బృందాలు నెల్లై, ఇతర రాష్ట్రాల్లో మదన్ కోసం గాలిస్తున్నాయి. వైద్య సీట్ల ఇప్పిస్తానని మోసం చేశాడని ఇప్పటి వరకు 63 మంది ఫిర్యాదులు చేశారు. రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మదన్ పట్టుబడిన తరువాత ఈ కేసులన్నిటిపై విచారిస్తామని అన్నారు. -
గజఈతగాళ్లు దిగినా చిక్కని ఆచూకీ
-
అదితి.. నువ్వెక్కడ?
* డ్రైనేజీల్లో విస్తృత గాలింపు * గజఈతగాళ్లు దిగినా చిక్కని ఆచూకీ మద్దిలపాలెం(విశాఖపట్నం): ఆరేళ్ల అదితి ఆచూకీ తెలియలేదు. ఏక్షణం ఏ కబురు వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనగా నిరీక్షిస్తున్నారు. విశాఖనగరం మద్దిలపాలెంలో గురువారం సాయంత్రం ట్యూషనుకు వెళ్లిన చిన్నారి అదితి వర్షపునీటి ఉధృతికి మురుగుకాలువలో పడి కొట్టుకుపోయింది. స్థానికులు గురువారం రాత్రి కాలువలన్నీ వెతికినా ఫలితం కనిపించలేదు. ఆలస్యంగా స్పందించిన జీవీఎంసీ సిబ్బంది బాలిక అన్వేషణలో పడ్డారు. మద్దిలపాలెం మొదలుకుని ఎంవీపీ కాలనీవరకూ డ్రెయినేజీ వ్యవస్థను జల్లెడ పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎంవీపీ కాలనీ కాలువలో గజ ఈతగాళ్ల బృందం మూడు సార్లు దిగినా ఫలితం కనిపించలేదు. జీవీఎంసీ కమిషన ర్ ప్రవీణ్‌కుమార్ శుక్రవా రం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లికి తెలియనివ్వకుండా.. అదితి తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటుండగా ఆమె విశాఖలో తాతగారి దగ్గర ఉంటోంది. తల్లిదండ్రులు బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం సీతమ్మధార చేరుకున్నారు. అదితికి ఆరోగ్యబాగాలేక ఆసుపత్రిలో చేర్పించామని బాలిక తల్లికి కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెకు గల్లంతు విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. బాలిక తండ్రి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. -
జాడలేని అదితి
కొనసాగుతున్న గాలింపు చర్యలు గజఈతగాళ్లు దిగినా చిక్కని ఆచూకీ మంత్రి గంటా.. కమిషనర్ సందర్శన {yెయినేజీలపై ఆదరాబాదరాగా సిమెంటు పలకల తొలగింపు మద్దిలపాలెం(విశాఖ): ఆరేళ్ల అదితి ఆచూకీ తెలియలేదు. ఏక్షణం ఏ కబురు వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనగా నిరీక్షిస్తున్నారు. మద్దిలపాలెంలో గురువారం సాయంత్రం ట్యూషనుకు వెళ్లిన చిన్నారి అదితి వర్షపునీటి ఉధృతికి మురుగుకాలువలో పడి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. స్థానికులు గురువారం రాత్రి కాలువలన్నీ వెతికినా ఫలితం కనిపించలేదు. ఆలస్యంగా స్పందించిన జీవీఎంసీ సిబ్బంది కూడా బాలిక అన్వేషణలో పడ్డారు. మద్దిలపాలెం మొదలుకుని ఎంవీపీ కాలనీవరకూ డ్రెయినేజీ వ్యవస్థను జల్లెడ పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎంవీపీ కాలనీలో గెడ్డలో గజ ఈతగాళ్ల బృందం మూడుసార్లు దిగినా ఫలితం కనిపించలేదు. సందర్శించిన గంటా..కమిషనర్ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రయినేజి కాలువలపై ఆక్రమణల ఫలితంగానే బాలిక అన్వేషణ జఠిలమైందని గుర్తించారు. మద్దిలపాలెం పరిసరాల్లో డ్రయినేజీలపై ఉన్న సిమెంట్ దిమ్మలను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.గెడ్డకు అనుసంధానంగా ఉన్న కొన్ని మ్యాన్‌హోల్స్‌ను కూడ తొలగించారు. నగరంలో 2వేల మీటర్ల మేర పెద్ద గెడ్డలు, 4వేల మీటర్ల చిన్నగెడ్డలు ఉన్నాయని వీటిలో చాలా వరకు ఆక్రమణలకు గురయిన విషయం వాస్తవమేనని కమిషనరు చెప్పుకొచ్చారు. నగరం వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర బింధువుగా మారుతున్న నేపథ్యంలో ఇటువంటివి సహజమేనన్నారు. ఈ వ్యవస్థ మొత్తం ప్రక్షాలనకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందన్నారు. మధ్యాహ్నం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గెడ్డలు, డ్రైనేజీ ఆక్రమణలు పరిశీలించారు. జీవీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల 3.7 కిలోమీటర్ల మేర గెడ్డ ఆధునీకరణ పనులు చేపట్టడంతో నీరు నేరుగా ప్రవహిస్తూ సముద్ర జలాల్లోకి కలిసిపోతుందని, దీనికారణంగా చిన్నారి ఆచూకి తెలుసుకోవడం కష్టంగా మారిందని కమిషనర్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు వివరించారు. విస్తృతంగా గాలించండి: నారాయణ: చిన్నారి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధిశాఖామంత్రి డాక్టర్ పి.వి.నారాయణ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. బాలిక ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలతోపాటు నేవీ అధికారుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. తల్లికి తెలియనివ్వకుండా.. అదితి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం సీతమ్మధార చేరుకున్నారు. అదితికి ఆరోగ్యంబాగాలేక ఆసుపత్రిలో చేర్పించామని బాలిక తల్లికి కు టుంబ సభ్యులు చెప్పారు. ఆమె కు గల్లంతు విషయం తెలియకుం డా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. గుండెల్లో విషాదం దాచుకుని గుంభనంగా తిరుగుతున్నా రు. ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. బాలిక తండ్రి శ్రీనివాసరావుసంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పాప కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘మా ముద్దుల బిడ్డ దోరుకుంతుందని భగవంతుడుని వేడుకుంటున్నాను. నా స్నేహితులు..స్థానికులు అన్నదమ్ముళ్లులా రాత్రి నుంచి గాలిస్తున్నారు. ఇద్దరు బాబుల తరువాత పాప పుట్టింది. నిత్యం ఫోన్లో మాట్లాడేది అంటూ కన్నీరు మున్నీరయ్యారు.