సాక్షి, కర్నూలు: జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 44పై ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన ప్యాపిలి మండలం పొదొడ్డి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలివి.. వీర ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో బయలుదేరింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది.
ఈ ఘటనలో 15మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇద్దరి డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.