ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు చెరువుకట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రహదారిపై నుంచి బస్సును పక్కకు తీశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.