అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం తేతలి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది.అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులను అక్కడి స్థానికులు రక్షించినట్టు సమాచారం. బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.