మంగళగిరి: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొద్దిసేపట్లోనే మంటల్లో పూర్తిగా దగ్దమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్ పోలీసులు వివరాల మేరకు.. శుభకార్యం నిమిత్తం గుంటూరు నుంచి కొంతమందిని తీసుకొచ్చేందుకు సోమవారం రాత్రి విజయవాడ స్వరూప ట్రావెల్స్‌కు చెందిన బస్సు బయలుదేరింది. డ్రైవర్ శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి బస్సులో ఉన్నారు. అయితే మంగళగిరి మండలం కాజ గ్రామం నారాయణ తీర్థులు ఆశ్రమం వద్దకు వచ్చేసరికి బస్సు ఏసీలో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి మరో వ్యక్తితో పాటు కిందకి దిగిపోయారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునేలోగానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్దమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలుసుకున్న బస్సు యజమాని పోలీసులకు వివరాలు అందజేశారు. ఏసీలో మొదలైన మంటలు పూర్తి బస్సుకు వ్యాపించి కొంత సమయంలోనే బస్సు పూర్తిగా కాలిపోయిందని పోలీసులకు డ్రైవర్ చెప్పాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొద్దిసేపట్లోనే ప్రైవేటు ట్రావెల్స్ దగ్దం
Published Tue, Jul 4 2017 8:59 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement