
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పాలసముద్రం సమీపంలో గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. ఎన్‌హెచ్-44పై ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వోల్వో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment