NH 44
-
నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!
సాగర్ (మధ్యప్రదేశ్): కోట్లు విలువచేసే స్మార్ట్ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్‌ను నలుగురు దొంగలు లూటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా మహరాజ్‌పూర్ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. అయితే ఆ ఫోన్లన్నింటినీ 24 గంటల్లోపే పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మాత్రం పారిపోయారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన ఈ మొబైల్ ఫోన్లను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా హరియాణాలోని గురుగ్రామ్‌కు తీసుకెళ్తున్నారు. ట్రక్కును గురువారం రాత్రి నలుగురు దుండగులు అడ్డుకుని డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. నరసింగాపూర్ వద్ద అతన్ని దింపేసి ఫోన్లను కంటైనర్ నుంచి తమ ట్రక్కులోకి మార్చుకుని పారిపోయారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలికి 400 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డగించడంతో ట్రక్కును వదిలేసి పారిపోయారు. మొత్తం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్ చెప్పారు. -
యాసంగి ధాన్యం కొనాల్సిందే!
సాక్షి నెట్వర్క్: తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. లేకుంటే కేంద్రానికి రాస్తా బంద్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్, విజయవాడ రహదారులపై రాస్తారోకోలు చేపట్టాయి. నేతలు, కార్యకర్తలు వరి కంకులు, ప్లకార్డులు చేపట్టి, రోడ్లపై ధాన్యం కుప్పపోసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద హైదరాబాద్–బెంగళూరు హైవే ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ‘‘రైతుల కోసం కేంద్రం ఏం చేసిం దో బీజేపీ నేతలు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. పండించిన పంటనే కొనలేని దద్దమ్మ ప్రభుత్వం. అగ్రిమెంట్ రాసిచ్చారని ఒకరు.. కొంటమని మరొకరు.. కొనమని ఇంకొకరు.. నూకలు తినాలంటరు. నూకలు మేం తినం.. మీకు నూకలు చెల్లినయ్’’ అని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనేదాకా ఊరుకోబోమన్నారు. ఇక్కడ గంటకుపైగా ఆందోళన సాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అడుగడుగునా నిరసనలతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్‌ల ఆధ్వర్యంలో 65వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండల కేంద్రం లో ఎమ్మెల్యే నోముల భగత్.. సూర్యాపేట సమీపంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్.. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో రాస్తారోకోలు జరిగాయి. ►యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు నిరసనలు చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ►నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వైజంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ►ఆదిలాబాద్ జిల్లా చాందా(టి) గ్రామ సమీపంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. ►సంగారెడ్డిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, మాణిక్‌రావు, దేవీప్రసాద్‌రావు, చింతా ప్రభాకర్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ►మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో, పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నేడు జిల్లా కేంద్రాల్లో దీక్షలు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, దీక్షలకు టీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీ మండల కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు దీక్షలకు రావాలని సూచించారు. -
'అనంత'లో అదుపు తప్పిన వోల్వో బస్సు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పాలసముద్రం సమీపంలో గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. ఎన్‌హెచ్-44పై ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వోల్వో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం) -
ఎన్‌హెచ్ 44పై భారీగా ట్రాఫిక్ జామ్
-
ఎన్‌హెచ్ 44పై ట్రాఫిక్ జామ్
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం బ్రిడ్జిపై ఓ లారీ నిలిచిపోవడంతో ఎన్‌హెచ్ 44 మార్గంలో రాకపోకలు స్తంభించాయి. బళ్లారి నుంచి అనంతపురం వైపు వెళుతున్న ఓ లారీ మంగళవారం ఉదయం బ్రిడ్జిపైకి వచ్చిన సమయంలో ఎదురుగా ఆటో రావడంతో తప్పించే క్రమంలో దిమ్మెను ఢీకొని పక్కకు ఒరిగింది. ఈ బ్రిడ్జి పై ఒక వాహనం మాత్రమే పట్టేంత స్థలం మాత్రమే ఉంటుంది. దీంతో ఉదయం 6.30 గంటల నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆ లారీని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
అనంతపురంలో కాల్పుల కలకలం
-
అనంతపురంలో కాల్పుల కలకలం
అనంతపురం:జిల్లాలోని ధర్మవరం మండలం సీతారామపురం వద్ద కాల్పుల కలకలం రేగింది. బుధవారం తెల్లవారుజామున ఎన్ హెచ్ 44పై కారులో వచ్చిన ఓ వ్యక్తి ఓ లారీడ్రైవర్పై కాల్పులు జరిపాడు. కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌కు చెందిన లారీ బెంగుళూరు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. లారీ పక్క నుంచి ఇండికా కారులో వచ్చిన దుండగులు కారులో నుంచే డ్రైవర్‌పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ సురేష్ డొక్కలో ఆరు బుల్లెట్లు దూసుకుపోయాయి. బుల్లెట్ల దెబ్బకు సురేష్ పక్కకు ఒరిగిపోవడంతో క్లీనర్ లారీని సమయస్ఫూరితో ఆపేశాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ధర్మవరం డిఎస్పీ వేణుగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ఇటిక్యాల: హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో వర్క్ ఇన్స్పెక్టర్గా దరూర్ మండలంలో పనిచేస్తున్న మురళీధర్ రెడ్డి(55), భార్య మణెమ్మ(45)తో కలసి కారులో కర్నూలు నుంచి గద్వాలకు వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. వారిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. -
ఎన్‌హెచ్ 44 పై మహిళ మృతి