ఇటిక్యాల: హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా దరూర్ మండలంలో పనిచేస్తున్న మురళీధర్ రెడ్డి(55), భార్య మణెమ్మ(45)తో కలసి కారులో కర్నూలు నుంచి గద్వాలకు వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. వారిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.