బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి | man killed in road accident warangal district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

Published Sun, May 22 2016 11:48 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

man killed in road accident warangal district

ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సీహెచ్.వెంకటేశ్వర్లు(45) ఓ పని విషయమై ఏటూరునాగారం వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో తిరిగి వెళ్తుండగా అతడిని లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement