రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
సూర్యాపేట, నేరేడుచర్ల, కోదాడలో ఘటనలు
సూర్యాపేటరూరల్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. సూర్యాపేట, నేరేడు చర్ల మండలాల పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు. తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామానికి చెందిన పోలేపాక ఉపేందర్(35) ఉపాధి నిమిత్తం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం గానుగుబండ గ్రామం నుంచి సూర్యాపేటకు ప్రయాణికులతో వచ్చాడు. వారిని అక్కడ దించిన అనంతరం స్వగ్రామానికి బయలుదేరాడు. గాంధీనగర్ గ్రామం వద్దకు వెళ్లగానే గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు ఆటో నడుపుతున్న ఉపేందర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెం దాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొని ఒకరు..
నేరేడుచర్ల : కోదాడకు చెందిన డికొండ వెంకటేశ్వర్లు(45) బైక్‌పై మిర్యాలగూడకు వెళుతున్నాడు. మార్గమధ్యలో అచ్చిరెడ్డి హోటల్ ముందు ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు..
కోదాడఅర్బన్ : పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన టి.ఉమామహేశ్వరరావు(50) ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ లారీపై క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆ లారీలో సరుకు తీసుకుని హైదరాబాద్ నుంచి విజయవాడకు గురువారం రాత్రి బయలుదేరారు. లారీ నల్లబండగూడెం సమీపంలోని రవాణాశాఖ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకోగానే ఉమామహేశ్వరరావు లారీకి సంబంధించిన అనుమతిపత్రాలను చూపించేం దుకు గాను రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఉమామహేశ్వరరావు తీవ్ర గాయాలలో అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనపై ఉమామహేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.