శబరిమల యాత్రలో విషాదం.. ఇద్దరి మృతి | Two Sabarimala pilgrims killed in road mishap | Sakshi
Sakshi News home page

శబరిమల యాత్రలో విషాదం.. ఇద్దరి మృతి

Published Tue, Dec 15 2015 12:37 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Two Sabarimala pilgrims killed in road mishap

కోజికోడ్: కేరళలో జరిగిన ఒక రోడ్డుప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులతో వస్తున్న వాహనం అదుపు తప్పి లారీని ఢీకొట్టి, అనంతర చెట్టును ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఇద్దరు  భక్తులు  అక్కడిక్కడే చనిపోగా వాహనం పూర్తిగా ధ్వంసమైంది.  
 
ఆరుగురు అయ్యప్ప భక్తుల బృందం ఒకవాహనంలో బయలుదేరి వెళ్లారు.  అయ్యప్ప దర్శనం  అనంతరం శబరిమలై నుంచి తిరిగి వస్తుండగా మల్లాపురం జిల్లా వెల్లిముక్కు దగ్గర మంగళవారం తెల్లవారుఝామున ఈ  విషాదం చోటుచేసుకుంది. మృతులను సతీష్ కుమార్ (49), అనూప్ ( 29)గా గుర్తించిన అధికారులు బంధువులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement