palasamudram
-
నాసిన్ ద్వారా ఏపీకి ప్రపంచ గుర్తింపు
-
ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు: సీఎం జగన్
-
బటన్ నొక్కి.. నాసిన్ అకాడమీ ప్రారంభించిన పీఎం మోడీ
-
శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
-
ముగ్గురిని కాటేసిన కరెంట్: కన్నీటిలో ‘కన్నికాపురం’
కడుపులు మాడ్చుకున్నాం. కష్టాలకోర్చి చదివించాం. మీకు ఏ లోటూ రాకుండా చూసుకున్నాం. చదువుల్లో రాణిస్తుంటే ఎంతో పొంగిపోయాం. త్వరలోనే ఉద్యోగాలు తెచ్చుకుని ఆసరాగా నిలుస్తారని ఆశపడ్డాం. ఇక మాకు కష్టాలు ఉండవని కలలుగన్నాం. కానీ ఆ దేవుడు మా ఆశలను చిదిమేశాడు. చేతికొచ్చిన కొడుకులను తీసుకెళ్లిపోయాడు. ఇక మాకు దిక్కెవరు కొడుకా..? అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన చూపరులను కంటతడి పెట్టించింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పాలసముద్రం: మండలంలోని కన్నికాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో సోమవారం ముగ్గురు మృతిచెందడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన చిన్నబ్బమందడి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. కంకర అవసరం కావడంతో వేల్కూరు నుంచి టిప్పర్‌లో తెప్పించి అన్లోడ్ చేయిస్తున్నాడు. అంతలోనే పైనే ఉన్న కరెంటు వైర్లు టిప్పర్‌కు తగలడంతో విద్యుదాఘాతానికి గురై డ్రైవర్ మనోజ్ (34) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో గ్రామస్తులు దొరబాబు (23), జ్యోతీశ్వర్ (19) ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో ముగ్గురూ మృత్యువాత పడడంతో గ్రామంలో తీరని విషాదం అలుముకుంది. ఆశలన్నీ వారిపైనే గ్రామానికి చెందిన సీదల బాలాజీనాయుడు, ఉష దంపతులకు దొరబాబు, సోమేశ్, చంద్రిమ పిల్లలు. దొరబాబు పెద్దవాడు. సోమేష్, చంద్రిమ కవలలు. ఇంటర్ చదువుతున్నారు. పెద్దకుమారుడి భవిష్యత్తు కోసం తపించారు. ఉన్నకొద్దిపాటి పొలంలో పంటలదిగుబడి అంతంతమాత్రంగా రావడంతో అప్పులపాలయ్యా రు. కానీ పిల్లల చదువుకు వెనకడుగు వేయలేదు. పస్తులుంటూ కూడబెట్టి పెద్ద కుమారుడు దొరబాబును తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని ఓ బీటెక్ కళాశాలలో చదివించారు. గతేడాది ఫస్ట్‌క్లాస్‌లో పాసవడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉద్యోగం వస్తుందని ఆశ పడ్డారు. కష్టాలు తీరుతాయని సంబరబడ్డారు. ఇంతలోనే విధి వారి ఆశలను చిదిమేసింది. అప్పటివరకు కళ్లెదుట కలియదిరుగుతూ మాటలు చెప్పిన కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడంతో తల్లడిల్లిపోయారు. ఇక అదే గ్రామానికి చెందిన వెంకటేష్ నాయుడు, రోహిణి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పవన్‌కుమార్ పెద్దవాడు. చిన్నవాడైన జ్యోతీశ్వర్ చదువుల్లో మేటి. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ పూర్తిచేశాడు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి రోహిణి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె సక్రమంగా నడవలేని స్థితి. ఇద్దరు పిల్లలూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు. ఉపాధి పనులకెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచేవారు. ఇంతలో అనుకోని ప్రమాదం ఓ కుమారుడిని కబళించడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇదిలా ఉండగా గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు పంచాయతీ, పెద్దకాలువ గ్రామానికి చెందిన మనోజ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. మృతులు ముగ్గురూ అవివాహితులు. లాక్డౌన్ లేకుంటే..! కరోనా లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో దొరబాబు, జ్యోతీశ్వర్ కూడా ఇంటివద్దే ఉండాల్సి వచ్చింది. లాక్డౌన్ లేకుంటే పిల్లలు చదువుల కోసం వెళ్లేవారని, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. -
'అనంత'లో అదుపు తప్పిన వోల్వో బస్సు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పాలసముద్రం సమీపంలో గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. ఎన్‌హెచ్-44పై ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వోల్వో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం) -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
గోరంట్ల(సోమందేపల్లి): మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారిపై కారుబోల్తాపడి గుంటూరు జిల్లాకు చెందిన రాధాకృష్ణరెడ్డి (36) అనే వ్యక్తి చనిపోగా మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. గురువారం గుంటూరు నుంచి అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా కారు జాతీయ ర హదారిపై ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న రాధాకృష్ణరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరెడ్డి, రాజేశ్వరయ్యలతో పాటు డ్రైవర్ చైతన్యలు తీవ్రంగా గాయపడగా ప్రథమ చికిత్స కోసం వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. డ్రైవర్ అజాగ్రత్తవల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాలాజి తెలిపారు. -
ఘనంగా ఉట్ల పరుష
గోరంట్ల (పెనుకొండ) : మండలంలోని పాల సముద్రంలో శుక్రవారం ఉట్టపరుష ఘనంగా జరిగింది. ఉట్లమాను ఎక్కడానికి యువకులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమాన్ని తిలకిండానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. -
నేడు 'అనంత'లో చంద్రబాబు పర్యటన
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పాలసముద్రంలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ ఎరోనాటిక్స్ సంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ఎం వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు హాజరుకానున్నారు. నేషనల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ ఎరోనాటిక్స్ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 500 ఏకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. -
ఎస్.ఐ పై టీడీపీ కార్యకర్తల దాడి
-
ఎస్.ఐ పై టీడీపీ కార్యకర్తల దాడి
స్థానిక ఎన్నికల వేళ చిత్తురు జిల్లా పాల సముద్రం మండలం కావేరి రాజపురంలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెడుతు ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడున్న టీడీపీ కార్యకర్తలను స్థానిక ఎస్.ఐ అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని సదరు కార్యకర్తలను ఎస్.ఐ హెచ్చరించారు. అప్పటికి వారు వినకపోవడంతో వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ తీవ్ర స్థాయిలో ఎస్.ఐ హెచ్చరించారు. అంతే మమ్మల్ని హెచ్చరించే స్థాయి నీదా అంటూ టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎస్.ఐపై దాడికి దిగారు. ఆ ఘటనలో ఎస్.ఐ గాయపడ్డారు. దాంతో పోలీసులు ఆగ్రహంతో టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు దెబ్బకు టీడీపీ కార్యకర్తలు కాళ్లకు పని చెప్పారు. స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలింగ్‌ను నిలిచిపోయింది. దాంతో పోలింగ్ బూత్‌లోని అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో జోనల్ ఉన్నతాధికారులు హుటాహుటిన కావేరి రాజపురం చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో దాదాపు గంట తర్వాత పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. అయితే కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేల్పుచర్లలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆదినారాయణపై ఆగంతకులు దాడి చేశారు. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆదినారాయణను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదినారాయణపై దాడిని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.