సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె, దసరా పండగు నేపథ్యంలో ప్రైవేటు వాహనదారులు విచ్చలవిడిగా ప్రజా సొమ్మును దోచుకుంటున్నారు. అందినకాడికి అందినట్లు అడ్డు అదుపు లేకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. పండుగ సమయం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న యజమానులు భారీగా దోపిడీకి దిగుతున్నారు. అయితే ప్రైవేట్ బస్సుల దోపిడీపై రవాణా శాఖ కొరడా విధిస్తోంది. అధిక చార్జీల వసూలుపై స్పెషల్ డ్రైవ్ జరపాలని రవాణా కమిషనర్ సీతారామాంజనేయులు ఆదేశించారు.
దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనీకీలు చేపడుతోంది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న 300 బస్సులపై అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అలాగే హైద్రాబాద్, ఇతర ప్రాంతాల నుండి వచ్చే బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు రవాణ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే బస్సులపై నిఘా పెంచారు. భారీగా చార్జీలు వసూలు చేస్తున్న వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment