
మంత్రి మహేందర్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్ : రవాణా శాఖ పై మంత్రి మహేందర్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రవాణా శాఖ రూ.3200 కోట్ల రెవెన్యూ టార్గెట్ సాధించిందని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఏపీ రవాణా మంత్రితో కూడా సమావేశం అయ్యామని, త్వరలోనే మళ్లీ ఒకసారి సమావేశం అవుతామని చెప్పారు.
ఇక మీదట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నగరంలో రాకుండా రింగ్ రోడ్డు దగ్గరే నిలిపివేయాలని ఆదేశించామని తెలిపారు. రింగ్ రోడ్డు నుంచి నగరం లోపలకు రావడానికి ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రవాణా శాఖ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు త్వరలో నిర్మిస్తామని చెప్పారు. త్వరలో పూర్తి స్థాయి రవాణా శాఖ కమిషనర్‌ను నియమిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరత ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment