ట్రావెల్స్ బస్సు బోల్తా, ఐదుగురి మృతి | 5 killed, 29 injured as private travels bus overturns near bangalore | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సు బోల్తా, ఐదుగురి మృతి

Published Mon, Jan 20 2014 8:27 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

5 killed, 29 injured as private travels bus overturns near bangalore

బెంగళూరు : కర్ణాటకలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. బెంగళూరుకు 20 కిలోమీటర్ల దూరంలో హోసకోటె సమీపంలో రాజేష్  ట్రావెల్స్కు చెందిన బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 29మంది గాయపడ్డారు. బస్సు తిరుపతి  నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

గాయపడినవారిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఎంఈజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49మంది ప్రయాణికులు ఉన్నట్లు సమచారం. కాగా  రాజేష్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే నెల్లూరులోని సంస్థ కార్యాలయాన్ని మూసివేశారు. తమ వారి గురించి తెలుసుకునేందుకు ప్రయాణీకుల బంధువులు.. మిత్రులు..కార్యాలయానికి చేరుకున్నారు. తమ వారి సమాచారం కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement