Published
Fri, Nov 18 2016 10:17 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
ఉత్తమ సేవకుడికి సత్కారం
మహానంది: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఏపీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ శంకర వరప్రసాద్ మూడు అవార్డులు అందుకున్నారు. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా మూడు బంగారు పతకాలు అందుకున్నారు. పెద్దాపురంలో ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఆయన అందించిన సేవలను గుర్తించి రెడ్‌క్రాస్ సొసైటీవారు ఆయనకు అవార్డులను అందించారు.