మహానందిలో రెచ్చిపోయిన కాంట్రాక్టర్
Published Sat, Sep 24 2016 3:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
- భక్తులపై దాడి
మహానంది: కర్నూలు జిల్లా మహానందిలో ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆలయంలో సెల్ ఫోన్లు ఉంచేందుకు అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కొందరు భక్తులు అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే ఆ విభాగం కాంట్రాక్టర్, సిబ్బంది కలిసి భక్తులపై దాడికి దిగారు. ఈ ఘటనతో భక్తులు భయ భ్రాంతులకు గురయ్యారు. అనంతరం ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని నంద్యాల రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement