- పోలీసు స్టేషన్ వెనుక పార్కింగ్
- పెద్దనంది వద్ద క్షురకుల షాపుల ఏర్పాటు
- పాలకమండలి సమావేశంలో తీర్మానాలు
మహానంది : మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తులకు రుచికరమైన భోజనాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్‌లు పేర్కొన్నారు. మహానందిలోని దేవస్థానం కార్యాలయంలో శుక్రవారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానందిలో ప్రస్తుతం 125 మందికి మాత్రమే అన్నదానం నిర్వహిస్తున్నామని, ఇక నుంచి ప్రతిరోజు 300 మందికి అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం అన్నం, రసం, మజ్జిగ ఇచ్చేవారని, ఇక నుంచి స్వీటు, చట్నీ, కర్రీ, పప్పు, సాంబారు, మజ్జిగ అందించి భక్తులకు ఆకలి తీర్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రస్తుతం ఆలయ పరిధిలో ఉన్న క్షురకుల షాపులను పెద్ద నంది విగ్రహం వద్దకు మారుస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందులు వాహనాల పార్కింగ్‌ను పోలీసుస్టేషన్ వెనుక, మహానంది తహాసీల్దార్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహానంది అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానందయ్య విగ్రహం ఏర్పాటుకు అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు బాలరాజు, రామకృష్ణ, చింతకుంట్ల శివారెడ్డి, బండి శ్రీనివాసులు, చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామయ్య, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, అన్నదాన పథకం ఇన్‌చార్జ్ పార్వతీ, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
మహానందీశ్వరుడి భక్తులకు రుచికర భోజనం
Published Sat, Jul 16 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement