
డిజిటల్ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత
డిజిటల్ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంచుతున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ జనరల్ మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ పేర్కొన్నారు.
– ఎస్‌బీఐ ఉభయరాష్ట్రాల సీజీఎం హరిదయాళ్ ప్రసాద్
మహానంది: డిజిటల్ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంచుతున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ జనరల్ మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ పేర్కొన్నారు. కర్నూలులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మహానందీశ్వరుడి దర్శనార్థం మంగళవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు సేవలు మరింత విస్తరిస్తున్నామన్నారు. అలాగే ఆన్‌లైన్ సేవల పట్ల ఖాతాదారులకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకుని వస్తామన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి జలసంపద అద్భుతమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకముందు సీజీఎం కుటుంబ సభ్యులకు ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, వేదపండితులు రవిశంకర అవధాని స్వాగతం పలికి పూజలు నిర్వహింపచేశారు. అనంతరం సీజీఎం స్థానిక స్వామివారి కల్యాణమండపంలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ఆయన వెంట నంద్యాల ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ వీరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.