మహానంది కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు
- మార్చిలో బోర్డు సమావేశం
– పోస్టుల భర్తీకి చర్యలు
– కాన్ఫరెన్స్ హాలు, ఎకో స్టూడియో ప్రారంభించిన డీన్ ఆఫ్ అగ్రికల్చర్
మహానంది: మహానంది సమీపంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలకు రాష్ట్రస్తాయి గుర్తింపు ఉందని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ తాతినేని రమేష్‌బాబు పేర్కొన్నారు. మహానంది వ్యవసాయ కళాశాలలో రూ. 6.50లక్షలతో నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్, రూ. 9లక్షలతో నిర్మించిన ఎకోస్టూడియోను ఫ్రొఫెసర్ అకడమిక్ టి.శ్రీనివాస్, అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురవయ్యతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చినెలలో విశ్వవిద్యాలయం బోర్డు సమావేశం మహానందిలోనే నిర్వహిస్తామన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ ఫోన్‌లో మాట్లాడారని, కళాశాల అభివృద్దికి ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని సూచించారన్నారు. అలాగే ఆర్థిక మంత్రితో చర్చించి ముందుగా కళాశాలలో ఖాళీగా ఉన్న 17అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్‌గేమ్ స్టేడియం, గెస్ట్‌హౌస్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపితే నిధుల మంజూరుకు తనవంతు కృషి చేస్తానన్నారు.సమావేశంలో అధ్యాపకులు డాక్టర్ కేఎన్ రవికుమార్, డాక్టర్ ఎంఎస్ రాహూల్, డాక్టర్ కేఎన్ శ్రీనివాసులు, డాక్టర్ సరోజినీదేవి, సుధారాణి, జయలక్ష్మి, మాధవి, హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరెడ్డి, రమేష్‌బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.