ప్రకాశం జిల్లా వృషభాల విజయకేతనం
ప్రకాశం జిల్లా వృషభాల విజయకేతనం
Published Sat, Feb 25 2017 11:01 PM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల్లో ప్రకాశం జిల్లా ఎద్దులు విజయకేతనం ఎగురువేశాయి. సీనియర్స్ విభాగంలో ఆరు జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రకాశం జిల్లా ముదిరాళ్లముప్పాల మండలం ఎన్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీలేఖ, మధులకు చెందిన వృషభాలు 2468.08 అడుగుల దూరం బండను లాగి ప్రథమస్థానంలో నిలిచాయి. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన కాసరనేని రాజాచౌదరికి చెందిన వృషభాలు 2403.02 అడుగుల దూరంతో ద్వితీయ స్థానంలో నిలిచాయి.
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం, ఎనగండ్ల గ్రామానికి చెందిన బాయికాటి బోడెన్న వృషభాలు 2157.7అడుగుల దూరంతో తృతీయస్థానం, గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన తోట శ్రీనివాసరావు వృషభాలు 2155 అడుగుల దూరంతో నాలుగవస్థానం, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన దాసరినారాయణరావు వృషభాలు 1396.9 అడుగులతో ఐదోస్థానం, శిరివెళ్ల మండలం ఖాదరబాదు గ్రామానికి చెందిన బండికృష్ణయ్య వృషభాలు 1008 అడుగుల దూరంతో ఆరోస్థానంలో నిలిచాయి. వీరికి వరుసగా రూ. 80వేలు, రూ. 60వేలు, రూ. 40వేలు, రూ. 30వేలు, రూ. 20వేలు, రూ.10వేలు బహుమతులను అందించారు. బుక్కాపురం గ్రామానికి చెందిన పన్నంగి వెంకటరమణ, పగిడ్యాల మండలానికి చెందిన అహ్మద్‌బాషాలు పోటీలను ప్రారంభించారు. ఒంగోలు జాతి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొప్పుల శివనాగిరెడ్డి, నిర్వాహకులు మురళీ, శివయ్య , తదితరులు పాల్గొన్నారు.
Advertisement