సకల సిద్ధిదాయినీ...శ్రీ సిద్ధిధాత్ర దుర్గ
సకల సిద్ధిదాయినీ...శ్రీ సిద్ధిధాత్ర దుర్గ
Published Sun, Oct 9 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
మహానంది: దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ సిద్ధిధాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై కొలువై అమ్మవారు ఆలయ పురవీధులో్ల ఊరేగారు. ఆలయంలోని స్వామివారి అలంకార మండపంలో అమ్మవారికి నిర్వహించిన సహస్రదీపాలంకరణ సేవ విశేషంగా ఆకట్టుకుంది. అలాగే నంద్యాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించాయి. కార్యక్రమాల్లో దేవస్థానం ఈఓ డాక్టర్ శంకర వరప్రసాద్, దాత రామకృష్ణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, ఉభయ దాతలు పాల్గొన్నారు. అమ్మవారు సోమవారం శ్రీ కామేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని వేదపండితులు తెలిపారు.
Advertisement
Advertisement