ఏప్రిల్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ
– అన్ని షాపుల్లో హెచ్‌పీఎఫ్‌ఎస్
– అధిక ధరలకు విక్రయిస్తే రూ.లక్ష నుంచి రూ. 5లక్షలు జరిమానా
– ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్
మహానంది: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ చట్టం అమలు చేస్తామని, అందుకు అనుగుణంగా వినూత్న మార్పులు తెస్తామని ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వైన్¯Œ షాపుల్లో హెచ్‌పీఎఫ్‌ఎస్(హలోగ్రాఫిక్ పాత్ ఫైండర్ సిస్టమ్) ఏర్పాటు చేస్తామన్నారు. ట్రేస్ అండ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా అన్నింటిని ఆన్‌లైన్ చేస్తామన్నారు. ప్రతి షాపులో సీసీ కెమెరాలు, సీసీ టీవీలు, ఆటోమిషన్ స్కాన్ విధానం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో మద్యంను అధిక ధరలకు విక్రయిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించేవారమని, కొత్త చట్టం ద్వారా ఫిర్యాదు అందితే రూ. 5లక్షలు జరిమానా విధిస్తామన్నారు. మహానందిలోని వైన్‌షాపును తొలగిస్తామని చెపా్పరు. ఆయన వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.