మహానంది (కర్నూలు) : స్నేహితులతో కలసి తుంగభద్ర నదిలో బోటింగ్‌కు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బోటులో నుంచి పడి గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శనివారం మృతదేహం లభ్యమైంది. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన వేణుగోపాల్(19) తన తొమ్మిదిమంది స్నేహితులతో కలిసి శుక్రవారం కర్నూలు జిల్లా మహానందీశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో బోటు పై షికారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు మృతదేహం లభ్యమైంది.