కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న టోల్‌గేట్ నిర్వాహణ కోసం చేపట్టిన బహిరంగ వేలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మహానంది: కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న టోల్‌గేట్ నిర్వాహణ కోసం చేపట్టిన బహిరంగ వేలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బహిరంగ వేలంలో రూ. 80.10 లక్షలకు మహానందికి చెందిన సుబ్బరామయ్య టెండర్‌ను చేజిక్కించుకున్నారు. అయితే షరతుల్లో ఉన్న విధంగా నగదును వెంటనే చెల్లించాలంటూ టెండర్ దారులు ఈవోతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.