31న ఒంగోలు జాతి పశువుల వేలాలు
ఎంసీ ఫారం(మహానంది): మహానంది సమీప ఎంసీ ఫారంలోని శ్రీ వెంకటేశ్వర పశు పరిశోధన స్థానంలోని 50 ఒంగోలు జాతి పశువుల విక్రయానికి సంబంధించి ఈ నెల 31వతేదీన వేలం పాటలు నిర్వహిస్తామని పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్.శ్రీనివాసనాయక్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిది తరుపులు, 41 కోడెదూడలను వేలంలో విక్రయిస్తామన్నారు. వీటిని ఉదయం 7గంటలకు ఫారం ఆవరణలో ప్రదర్శనకు ఉంచుతామన్నారు. వేలంలో పాల్గొనేవారు ఆధార్‌కార్డు, పట్టాదారు పుస్తకం జిరాక్స్ ప్రతులు ఇవ్వడంతోపాటు రూ. 2వేల దరావత్తు చెల్లించాలని సూచించారు.