కర్నూలు జిల్లా మహానంది సమీపంలోని శ్రీనగరం వద్ద వేగంగా వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడి కృష్ణ(16) అనే బాలుడు మృతి చెందాడు.
మహానంది: కర్నూలు జిల్లా మహానంది సమీపంలోని శ్రీనగరం వద్ద వేగంగా వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడి కృష్ణ(16) అనే బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కృష్ణ తదితరులు మహానందివైపు వెళుతుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 వాహనంలో మహానందికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.