మహానందికి చేరుకున్న మహానందీశ్వరుడు
మహానందికి చేరుకున్న మహానందీశ్వరుడు
Published Wed, Oct 12 2016 10:56 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
నంద్యాల: దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి నంద్యాల వచ్చిన మహానందీశ్వర స్వామి మహానంది క్షేత్రానికి బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి స్వామి కామేశ్వరీ దేవి అమ్మవారితో కలిసి గత నెల 30 న నంద్యాల చేరుకున్నారు. కోట వీధిలోని బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయంలో పూజలందుకున్నాక, ఉత్సవిగ్రహాలను పల్లకిలో మహానందీ క్షేత్రానికి లాంఛనాలతో తీసుకొనివెళ్లారు. దీంతో దసరా ఉత్సవాలు ముగిశాయి.
Advertisement
Advertisement