మహానంది: పీర్ల ఊరేగింపు తమ కాలనీకి రాలేదంటూ గ్రామస్తుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో మంగళవారం ఉదయం మౌలాలిస్వామి పీర్ల జాతర మొదలైంది. అయితే, గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి పీర్ల ఊరేగింపు వెళ్లకపోవడంతో కాలనీవాసులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని రెండు వర్గాల వారితో మాట్లాడి, శాంతింపజేశారు.