ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయాల్లో చాలా ఏళ్లుగా స్థిరంగా ఉంటున్న సిబ్బంది మరోచోటుకి వెళ్లే సమయం వచ్చింది. కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరిగాయి. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆలయ ఏఈవో, సూపరింటెండెంట్ సహా 9 మందికి స్థానచలనం కలిగింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ట్రాన్స్‌ఫర్లు జరగటంతో ఆలయవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
మరోవైపు విజయవాడ దుర్గగుడిలో 36 మంది సిబ్బందిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ద్వారకా తిరుమల ఆలయంలో సైతం 17 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.