![Movie Actor Nagineedu Came Mahanandi Kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/6/11.jpg.webp?itok=dvfHWLZi)
సాక్షి, మహానంది: మర్యాద రామన్న చిత్రం తనకెంతో గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సినీ నటుడు నాగినీడు తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం గురువారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటగా ప్రసాద్ ల్యాబ్స్‌లో వర్కర్‌గా పనిచేసేవాడినన్నారు. అక్కడ పనిచేస్తుండగా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనను గుర్తించి ఫిజిక్ బాగుందని మొదటగా చెన్నకేశవరెడ్డి చిత్రంలో అవకాశం ఇచ్చారన్నారు.
అనంతరం వచ్చిన మర్యాద రామన్న చిత్రం తనకెంతో గుర్తింపు తెచ్చిందని చెప్పారు. చిత్రంలో రామినీడు పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం లభించిందన్నారు. ప్రస్తుతం వాల్మీకి, బందోబస్త్ చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న మనిషి ఆకలి తీర్చడం ద్వారా లభించే ఫలితం అనంతమైనదని చెప్పారు. తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో మనోవికాస్ కేంద్రం పేరుతో విద్యార్థులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. తన కుమారుడి వైద్యసేవల నిమిత్తం నంద్యాల పట్టణానికి వచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment