Nagineedu
-
ప్రసాద్ లాబ్స్ కి నేనే కింగ్ గా ఉండేవాడిని...!
-
మర్యాద రామన్న సినిమా తర్వాత నా జీవితం...!
-
నాగినీడు మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే
-
డబ్బులు తీసుకోకుండా స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తా..
-
సంతోషం లేని జీవితం నాది.. |
-
కేవలం 1016 రూ..తీసుకొని సినిమాలు చేసేవాడిని..
-
ప్రసాద్ ల్యాబ్స్ లో జిఎం గా పని చేశా
-
ఇప్పటికి నా కారు నేనే తుడ్చుకుంట..!
-
చిన్నప్పుడు వాళ్లను కొట్టేసేవాడిని: మర్యాద రామన్న నటుడు
మర్యాద రామన్న సినిమా పేరు చెప్పగానే సునీల్‌తో పాటు గుర్తొచ్చే నటుడు వెల్లంకి నాగినీడు. ఈ సినిమాతో నంది అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. నాగినీడు గతంలో ప్రసాద్ ల్యాబ్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేసేవారు. సినిమా ప్రివ్యూలు చూసి ఏది ఆడుతుంది, ఏది ఆడదనేది ముందుగానే ఊహించేవారు. అయితే తనకు నటించాలని ఉందన్న విషయాన్ని కానీ, అవకాశాలు ఇవ్వమని కానీ ఎవరినీ నోరు తెరచి అడగలేదు. ఈ క్రమంలో 2010లో వచ్చిన మర్యాద రామన్న చిత్రంలో నటుడిగా విశ్వరూపం చూపించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'ప్రసాద్ ల్యాబ్‌కు దాసరి నారాయణరావు, కృష్ణ, రాఘవేంద్రరావు, కృష్ణంరాజు.. ఇలా చాలామంది వచ్చేవారు. కానీ ఎన్నడూ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్.. ఛాన్సులు కావాలని అడగలేదు. ఇకపోతే మర్యాద రామన్నలో నేను చేసిన పాత్ర నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నాది రాయలసీమ. మీరు ఇచ్చేదానికి రెట్టింపు మర్యాద నేనిస్తా, అలాగే ఏదైనా తేడా చేస్తే అంతకు మించి తేడా చేస్తా. తప్పు జరిగిన చోట నేను ఫ్యాక్షన్ లీడర్లా నిలబడతా. 9, 10వ తరగతికే థియేటర్‌కు వెళ్లి టికెట్లు ఇచ్చేవాడిని. ఎవడైనా బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కొట్టేసేవాడిని. నా గురించి నాకు ఎలాంటి భయం లేదు. నాకెవరూ మార్గం చూపించరు.. నాకు అవకాశాలు ఇవ్వరు.. నన్ను ఆదుకోరు అన్న భయాలు నాకు లేవు. అది పొగరు కాదు, నాపై నాకున్న నమ్మకం' అని చెప్పుకొచ్చారు నాగినీడు. చదవండి: నటి మృతి.. తన మరణానికి కారణమదేనా? వైరలవుతున్న వీడియో -
‘మర్యాద రామన్న’తో గుర్తింపు
సాక్షి, మహానంది: మర్యాద రామన్న చిత్రం తనకెంతో గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సినీ నటుడు నాగినీడు తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం గురువారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటగా ప్రసాద్ ల్యాబ్స్‌లో వర్కర్‌గా పనిచేసేవాడినన్నారు. అక్కడ పనిచేస్తుండగా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనను గుర్తించి ఫిజిక్ బాగుందని మొదటగా చెన్నకేశవరెడ్డి చిత్రంలో అవకాశం ఇచ్చారన్నారు. అనంతరం వచ్చిన మర్యాద రామన్న చిత్రం తనకెంతో గుర్తింపు తెచ్చిందని చెప్పారు. చిత్రంలో రామినీడు పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం లభించిందన్నారు. ప్రస్తుతం వాల్మీకి, బందోబస్త్ చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న మనిషి ఆకలి తీర్చడం ద్వారా లభించే ఫలితం అనంతమైనదని చెప్పారు. తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో మనోవికాస్ కేంద్రం పేరుతో విద్యార్థులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. తన కుమారుడి వైద్యసేవల నిమిత్తం నంద్యాల పట్టణానికి వచ్చినట్లు వివరించారు. -
వజ్రకరూరులో సినీనటుడు నాగినీడు
వజ్రకరూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం సినీనటుడు నాగినీడు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని కొనకొండ్ల, చాబాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు వజ్రకరూర్ మోడల్ స్కూల్ విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం నాగినీడు సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. మర్యాద రామన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత పలువురు నా వద్దకు వచ్చి మీ వాయిస్ బాగుందని చెప్పారన్నారు. అప్పటి నుంచి నాకు తెలిసిన విషయాలను నలుగురికీ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా నాగినీడుతో ఫొటోలు దిగేందుకు పలువురు విద్యార్థులు ఉత్సాహం చూపారు. ఆయన వెంట జేవీవీ రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్‌యాదవ్, ఆర్డీటీ సీఓ నాగప్ప, తదితరులు ఉన్నారు. -
మురడిలో నటుడు నాగినీడు
డీ.హీరేహాళ్ : శ్రావణమాసం సందర్భంగా ఆంజినేయస్వామి దర్శనాల్లో భాగంగా సినీ నటుడు నాగినీడు కుటుంబ సమేతంగా మురడి, నేమకల్లు ఆంజినేయస్వామి ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసంలో ప్రతియేటా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఈఓ శ్రీనివాసులు, జితేంద్ర ఆయనకు శాలువా కప్పి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
కాళిచరణ్ సినిమా ప్రెస్ మీట్