మహానందీశ్వరుడి సేవలో.. | district chief justice in mahanandi | Sakshi
Sakshi News home page

మహానందీశ్వరుడి సేవలో..

Published Sun, Sep 18 2016 9:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

మహానందీశ్వరుడి సేవలో..

మహానందీశ్వరుడి సేవలో..

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. అనుపమచక్రవర్తి ఆదివారం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు.

మహానంది: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. అనుపమచక్రవర్తి ఆదివారం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పాణ్యం ప్రసాదరావు, ప్రొటోకాల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావులు  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కోదండరామాలయం, వినాయకనంది ఆలయాల్లో హారతి తీసుకుని పూజలు చేపట్టారు. న్యాయమూర్తి దంపతులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేయించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement