
సాక్షి, అమరావతి : గోశాలలో గోవుల మృతిపై విచారణకై డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. గోవుల మరణానికి కారకులను, అందుకు గల కారణాలను కనుగొనే దిశగా సిట్ విచారణ వేగవంతం చేయనుంది. కాగా విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో భారీ సంఖ్యంలో గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇక గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్ పాయిజనింగ్ కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
చదవండి : గోవుల మృత్యు ఘోష
Comments
Please login to add a commentAdd a comment