విషాదం: తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి | 100 Cows Died In Kotturu Tadepalli Gaushala | Sakshi
Sakshi News home page

కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి

Published Sat, Aug 10 2019 9:30 AM | Last Updated on Sat, Aug 10 2019 1:18 PM

100 Cows Died In Kotturu Tadepalli Gaushala - Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో 100  ఆవులు మృతి చెందాయి. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతిచెందిన ఆవులకు పోస్ట్‌మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. మరికొన్ని పశువులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. 100 గోవులు చనిపోవడంపై గో సంరక్షణ కార్యదర్శి సాహు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధకరమన్నారు. రాత్రి సమయంలో పశువులకు వేసిన దాణా పాయిజనింగ్‌ అయి వుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement