Krishan
-
'యానిమల్' నిర్మాత ఇంట్లో విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి
'యానిమల్' నిర్మాతల్లో ఒకరైనా కృషన్ కుమార్ కుమార్తె కన్నుమూసింది. చాలా చిన్న వయసులోనే అంటే 20 ఏళ్లకే క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించింది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన నిర్మాణ సంస్థ టీ-సిరీస్ కూడా మరణవార్తని ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)బాలీవుడ్లోనే బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్. ప్రస్తుతం దీన్ని భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఈయనకు చిన్నాన్న కృషన్ కుమార్. ప్రస్తుతం కృషన్.. టీ-సిరీస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 1995లో 'బేవఫా సనమ్' అనే సినిమాలో నటించిన ఈయన.. ఆ తర్వాత పూర్తిగా నిర్మాణ వ్యవహారాలకే పరిమితమైపోయారు. గతేడాది వచ్చిన 'యానిమల్' నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు.ఇకపోతే కృషన్ కుమార్‌కి ఒకే ఒక్క కూతురు త్రిష కుమార్. ప్రస్తుతం ఈమెకు 20 ఏళ్లు. కానీ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడిన ఈమెకు జర్మనీలో అత్యాధునిక చికిత్స అందించారు. కానీ వైద్యులు ఈమెని కాపాడలేకపోయారు. జూలై 18న త్రిష తుది శ్వాస విడిచింది. మరీ చిన్న వయసులోనే ఇలా క్యాన్సర్‌తో త్రిష చనిపోవడం బాధాకరమైన విషయం!(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!) -
చావేగతి అని.. యూట్యూబ్‌లో వెతికి.. ఆన్లైన్లో ఆర్డర్ చేసి..
రామవరప్పాడు (గన్నవరం): సంతోషాల పొదరిల్లు వారి కుటుంబం.. భార్య, భర్త ఇద్దరు పిల్లలతో ఆనందంగా సాగిపోతుంది వారి జీవితం.. అటువంటి సమయంలో కరోనా మహమ్మారి కాటేసింది. ఇంటి పెద్దయిన భర్తను దూరం చేసింది.. తనకు, తన బిడ్డలకు అండగా ఉంటారనుకున్న అత్తింటి వారు ఆమె ఆవేదనను మరింత ఎక్కువ చేశారు. ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనన్న ఆలోచనతో ఆ తల్లిని వేధింపులకు గురిచేశారు. తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక ఇక లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఎలా ఆత్మహత్య చేసుకోవాలో యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ఓ కెమికల్‌ను ఆన్‌లోనే కొనుగోలు చేసింది. తన ఒక్కతే చనిపోతే.. ఇద్దరు బిడ్డలు అనాథలవుతారని ఆలోచించింది. ఆ కెమికల్‌ను తనతోపాటు, తన బిడ్డలకు పట్టించింది. కళ్లముందే బిడ్డలు చనిపోతుంటే చూడలేకపోయిందో.. లేక చివరిగా తన అక్కతో మాట్లాడాలనుకుందో గానీ విషయాన్ని ఆమె అక్కకు ఫోన్లో చెప్పింది. వెంటనే స్పందించిన అక్క హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించింది. ఆ ఘటన విజయవాడరూరల్ మండలం నిడమానూరులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇవి.. నిడమానూరు రామానగర్ రామాలయం సమీపంలో సూరెడ్డి బాలకృష్ణ, దివ్య (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భార్గవ్ (7), రోహిత్ (5) సంతానం. బాలకృష్ణ చందు కార్ ట్రావెల్స్‌లో మెనేజర్‌గా పని చేసేవాడు. మూడు నెలల క్రితం కరోనాతో బాలకృష్ణ మృతి చెందాడు. అప్పటి నుంచి దివ్య పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్త మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఒంటరిగా తనలో తాను కుమిలిపోతుండేది. అధికమైన అత్తింటి వేధింపులు ఈ క్రమంలో దివ్యకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. రామానగర్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో దివ్య, ఫస్ట్ ఫ్లోర్లో అత్త, సెకండ్ ఫ్లోర్లో మరిది ఉంటున్నారు. బాలకృష్ణ మృతి చెందినప్పటి నుంచి అత్త సుజాత, మరిది శ్రీనివాసరావు, తోడికోడలు మల్లీశ్వరి కలిసి దివ్యను వేధింపులకు గురి చేస్తున్నారు. భర్త చనిపోయినా ఇక్కడెందుకు ఉన్నావు.. పుట్టింటికి వెళ్లిపో అంటూ చీటికీ మాటికీ గొడవ పడుతుండేవారు. భర్త మరణంతో ఆధారం కోల్పోయానని, ఉన్న ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని దివ్య అత్తింటివారిని కోరింది. దీనికి అత్త సుజాత, మరిది శ్రీనివాసరావు నిరాకరించడంతో పిల్లలను ఎలా చదివించాలి, పోషించాలన్న ఆలోచనతో మనోవేదనకు గురైంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దివ్య, భార్గవ్, రోహిత్ అక్కకు విషయం చెప్పడంతో.. అర్ధరాత్రి దాటిన తర్వాత పెనమలూరులో నివాసం ఉంటున్న తన అక్కకు దివ్య ఫోన్ చేసి, తాము చనిపోతున్న విషయాన్ని చెప్పింది. ఆమె వెంటనే స్పందించి బంధువులతో కలిసి దివ్య ఇంటికి వచ్చింది. అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్న తల్లీపిల్లలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. పిల్లలు రెయిన్బో ఆస్పత్రిలో, దివ్య ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పిల్లలకు ప్రాణాపాయం నుంచి బయట పడగా.. దివ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో సెర్చ్ చేసి.. ఒక పక్క భర్త మృతి చెందడం, మరో పక్క అత్తింటి వారి వేధింపులు ఎక్కువవడంతో జీవితంపై విరక్తి చెందిన దివ్య చనిపోవాలని నిర్ణయించుకుంది. యూట్యూబ్‌లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనే అంశంపై శోధించింది. సోడియం ఎజైడ్ కెమికల్ తాగితే వెంటనే ప్రాణాలు పోతాయని తెలుసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారన్న ఉద్దేశంతో శనివారం రాత్రి కెమికల్‌ను తాను తాగి, పిల్లలకూ తాగించింది. -
నా కొంప ముంచడానికే వరద వస్తోంది!
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉంటే.. వరద నా కొంప ముంచడానికే వస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రాజెక్టుల దగ్గరకి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ఆనందిస్తున్నారని, కానీ చంద్రబాబు కుటుంబం మాత్రం బాధగా ఉందని ఆయన అన్నారు. శనివారం అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై సెక్యురిటీ జోన్లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారని ప్రశ్నించారు. కృష్ణానదికి ఈ స్థాయిలో వరద రావడం చాలా అరుదున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వచ్చినంత కోపం కృష్ణా వరదలతో చంద్రబాబుకు వచ్చిందని అన్నారు. ఆయన నివాసం అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందే చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పని తెలిసికూడా మొండిగా అక్కడే వుంటున్నారని విమర్శించారు. వరదలతో చంద్రబాబు నివాసం మునిగిపోతే.. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. కాగా భారీ వరదలతో నది గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లో నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని అక్కడి సిబ్బందికి అధికారులు సూచించారు. సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టారు. ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారు. నోటీస్ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదని సూచిస్తున్నాం. తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారు. మీక్షేమం కోసం చెబుతున్నాం. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు?. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వ ఇళ్లు ఏర్పాటు కోసం చంద్రబాబు కోరితే పరిశీలిస్తాం’ అని అన్నారు. -
విషాదం: తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి
సాక్షి, కృష్ణా: విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతిచెందిన ఆవులకు పోస్ట్‌మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. మరికొన్ని పశువులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్ పాయిజనింగ్ కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. 100 గోవులు చనిపోవడంపై గో సంరక్షణ కార్యదర్శి సాహు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధకరమన్నారు. రాత్రి సమయంలో పశువులకు వేసిన దాణా పాయిజనింగ్ అయి వుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
గోదావరి నుంచి కృష్ణాకు.. రోజుకు 4 టీఎంసీలు
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గడం, ఆల్మట్టి జలాశయం ఎత్తును కర్ణాటక ప్రభుత్వం 519.6 అడుగుల నుంచి 524.65 అడుగులకు పెంచుతుండటం వల్ల రానున్న రోజుల్లో నీటి లభ్యత మరింత తగ్గే ప్రమాదం ముంచుకొస్తుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పరిధిలో సాగునీటికే కాదు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో గోదావరి నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల చొప్పున సముద్రంలో కలుస్తున్నట్లు 47 ఏళ్ల సగటు లెక్కల ఆధారంగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కడలి పాలవుతున్న గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించి ఆయకట్టును స్థిరీకరించే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావులు చర్చించారు. జూలై 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం గోదావరిలో జూలై నుంచి అక్టోబర్ వరకూ సుమారు నాలుగు నెలలపాటు వరద ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున నాలుగు నెలల్లో 400–500 టీఎంసీల గోదావరి జలాలను తరలించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల కింద ఆయకట్టును స్థిరీకరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల్లో ఇదో గొప్ప ముందడుగుగా సాగునీటి రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించడంపై సమగ్రంగా అధ్యయనం చేసి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులను ఇద్దరు సీఎంలు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టును చేపట్టి రెండేళ్లలోగా పూర్తి చేసి శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీరు అందించాలని నిర్ణయించారు. మరోవైపు నాగార్జునసాగర్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలను దీనిద్వారా సస్యశ్యామలం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడిగా కమిటీ ఏర్పాటు ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించడంపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైడ్రాలజీ విభాగం సీఈ రత్నకుమార్, తెలంగాణ అంతరాష్ట్ర విభాగం సీఈ నర్సింహరావుల నేతృత్వంలో ఉమ్మడిగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ తరఫున రిటైర్డు ఈఎన్సీలు రోశయ్య, బీఎస్‌ఎన్‌రెడ్డి, రెహమాన్, సుబ్బారావు, రౌతు సత్యనారాయణలు, తెలంగాణ తరఫున రిటైర్డు ఈఎన్సీలు శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటరామారావు, సత్తిరెడ్డి తదితరులు సహకరించనున్నారు. ఐదు రకాల ప్రతిపాదనలు... అభయారణ్యం, వైల్డ్ లైఫ్ శాంక్చరీ, అటవీ భూములు అధికంగా ఉంటే కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు సాధించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అటవీ భూములు తక్కువగా సేకరించేలా, అభయారణ్యం, వైల్డ్ లైఫ్ శాంక్చరీలను తప్పిస్తూ గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించేలా అలైన్మెంట్ రూపొందించాలని ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్‌లు అధికారులను ఆదేశించారు. మైదాన ప్రాంతం ద్వారా నీటిని తరలించేలా చర్యలు చేపట్టగలిగితే ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా తగ్గించవచ్చని, వీటిని దృష్టి పెట్టుకుని అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల జలవనరుల విభాగం అధికారులు ఐదు రకాల ప్రతిపాదనలు చేశారు. ప్రతిపాదన – 1 దుమ్ముగూడెం–టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం. అంటే.. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను టెయిల్‌పాండ్ ప్రాజెక్టులోకి కాకుండా నేరుగా నాగార్జునసాగర్‌కు సగం నీటిని తరలించడం. మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైలంలోకి తరలించడం. ప్రతిపాదన – 2 అకినేపల్లి నుంచి గోదావరి జలాలను తరలించి నాగార్జునసాగర్‌లోకి సగం నీటిని ఎత్తిపోయడం. మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైలంలోకి తరలించడం. ప్రతిపాదన – 3 రాంపూర్ నుంచి గోదావరి జలాలను తరలించి నాగార్జునసాగర్‌లోకి సగం నీటిని తరలించడం. మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైలంలోకి ఎత్తిపోయడం. ప్రతిపాదన – 4 ఇంద్రావతి కలసిన తర్వాత మేడిగడ్డకు దిగువన తుపాకులగూడెంకు ఎగువ నుంచి గోదావరి జలాలను తరలించి.. సగం నీటిని నాగార్జునసాగర్‌లోకి, మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైలంలోకి తరలించడం. ప్రతిపాదన – 5 పోలవరం ఎగువ నుంచి గోదావరి జలాలను తరలించి ఒక బ్రాంచ్ ద్వారా సగం నీటిని నాగార్జునసాగర్‌లోకి, మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైంలోకి ఎత్తిపోయడం. (పోలవరం నుంచి నీటిని తరలించాలంటే అధిక శాతం అటవీ భూమిని సేకరించాల్సి వస్తుందని, అభయారణ్యం అడ్డొస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ఇరు రాష్ట్రాల అధికారులు ఆదిలోనే తిరస్కరించారు). శరవేగంగా సర్వే.. గోదావరి జలాల తరలింపుపై రెండు రాష్ట్రాల అధికారులు, నిపుణులు చేసిన ప్రతిపాదనల ఆధారంగా టోపోగ్రాఫికల్ అలైన్‌మెంట్‌ను రూపొందించి క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే చేయనున్నారు. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదేశించిన నేపథ్యంలో లేడార్ సర్వే ద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించే రెండు మూడు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తరలించే ప్రతిపాదనలను రూపొందించి ఇద్దరు సీఎంలు ఖరారు చేసిన ప్రతిపాదనల ఆధారంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక, అంచనాలు (ఎస్టిమేట్లు) తయారు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులకు ఒకసారి రెండు రాష్ట్రాల జలవనరుల ఉన్నతాధికారులు సమావేశమై సర్వే పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. దామాషాలో ప్రాజెక్టు ఖర్చు కృష్ణా నది ద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు ఏ మేరకు ప్రవాహం వస్తుంది? ఏ మేరకు నీటి కొరత ఉంటుంది? నీటి ఎద్దడిని అధిగమించడానికి ఏ ప్రాజెక్టులకు ఎంత మేరకు నీరు అవసరం? అనే వివరాలను సేకరించాలని రెండు రాష్ట్రాల అధికారులను ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ ఆదేశించారు. దీని ఆధారంగా గోదావరి నుంచి రోజుకు ఎన్ని టీఎంసీల జలాలను తరలించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. గోదావరి నుంచి తరలించే జలాల వినియోగం ఆధారంగా దామాషా పద్ధతిలో ప్రాజెక్టు వ్యయాన్ని, నిర్వహణ ఖర్చులను భరించేలా ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. దేశానికి ఆదర్శం: వైఎస్ జగన్ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో, నీటిపారుదల రంగం విషయంలో కేసీఆర్ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యే విషయంలో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, రెండు రాష్ట్రాలు కలసి నదీ జలాలను తమ సాగునీటి అవసరాలు తీర్చే విధంగా మలుచుకుంటే ఎంతో ఉత్తమమని తాను భావించానని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ఎవరో పరిష్కరించడం కంటే, ఈ రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. రెండు రాష్ట్రాలు వేసిన అడుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గొప్ప ప్రారంభం: కేసీఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలసి ముందడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశం గొప్ప ప్రారంభమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విభజన సందర్భంగా తలెత్తిన అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా, సానుకూల ధృక్పథంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఖడ్గచాలనం అవసరం లేదని, కరచాలనం కావాలన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించాలనేది తమ విధానమని, అదే విధానంతో మహారాష్ట్రతో వ్యవహరించి ఫలితం సాధించామన్నారు. తెలంగాణ, ఏపీ కూడా అలాగే వ్యవహరించి పరస్పరం మేలు కలిగే విధంగా వ్యవహరిస్తాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు ఫలితాలు అందించాలని అధికారులకు సూచించారు. -
ఫైనల్లో లిస్టన్, కృషన్
సాక్షి, హైదరాబాద్: ఆసియన్ జూనియర్స్ అండర్- 14 టెన్నిస్ టోర్నమెంట్లో లిస్టన్, కృషన్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో లిస్టన్ 6-0, 6-1తో భూపతి శక్తివేల్‌పై గెలుపొందగా... కృషన్ 6-2, 6-0తో కోట శశిధర్‌ను ఓడించాడు. బాలికల విభాగంలో ధమిజ 6-3, 7-5తో సంజనపై, మలైకా 6-3, 6-0తో శాంభవి తివారీపై గెలుపొందారు. మరోవైపు డబుల్స్ విభాగంలో సృజన- ముషత్ర్ జంట 6-1, 7-5తో సాగరిక- అదితి నారాయణ్ జోడీపై, స్మృతి బాసిన్ - శాంభవి జంట 6-1, 6-3తో అభిలాష- తనీష జోడీపై నెగ్గింది. బాలుర డబుల్స్ సెమీస్‌లో మనన్- ఆర్నవ్ జంట 6-2, 6-1తో కార్తీక్- ఆదిత్య జోడీపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. -
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ
క్రిషన్, దీపికా దాస్, యగ్నస్ ముఖ్య తారలుగా క్రిషన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఈ మనసే’. బన్ని మీడియా సమర్పణలో శ్రీ రాజేశ్వరి క్రియేషన్స్ పతాకంపై జి. రాజేశ్వరి, నిమ్మల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుభాష్ ఆనంద్ స్వరపరచిన పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో ఈ సినిమా చేశాం. అందరి హృదయాలను తాకే విధంగా ఉంటుంది. ఈ నెలాఖరున సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ లవ్ ఎంటర్టైనర్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి రచనాసహకారం: చైతన్య, సహనిర్మాతలు: వి. బాలాజీ, జి. దీప. -
మద్యం అలవాటును ప్రోత్సహిస్తున్న సర్కారు