ఆసియన్ జూనియర్స్ అండర్- 14 టెన్నిస్ టోర్నమెంట్‌లో లిస్టన్, కృషన్ ఫైనల్లోకి ప్రవేశించారు.
సాక్షి, హైదరాబాద్: ఆసియన్ జూనియర్స్ అండర్- 14 టెన్నిస్ టోర్నమెంట్‌లో లిస్టన్, కృషన్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో లిస్టన్ 6-0, 6-1తో భూపతి శక్తివేల్‌పై గెలుపొందగా... కృషన్ 6-2, 6-0తో కోట శశిధర్‌ను ఓడించాడు.
బాలికల విభాగంలో ధమిజ 6-3, 7-5తో సంజనపై, మలైకా 6-3, 6-0తో శాంభవి తివారీపై గెలుపొందారు. మరోవైపు డబుల్స్ విభాగంలో సృజన- ముషత్ర్ జంట 6-1, 7-5తో సాగరిక- అదితి నారాయణ్ జోడీపై, స్మృతి బాసిన్ - శాంభవి జంట 6-1, 6-3తో అభిలాష- తనీష జోడీపై నెగ్గింది. బాలుర డబుల్స్ సెమీస్‌లో మనన్- ఆర్నవ్ జంట 6-2, 6-1తో కార్తీక్- ఆదిత్య జోడీపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది.