pujalu
-
సుస్థిర అభివృద్ధి సాధించాలి
హనుమకొండ అర్బన్: చారిత్రక వారసత్వ నగరం ఓరుగల్లు సుస్థిర అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన అయన హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, ప్రఖ్యాత కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో భేటీ అయ్యారు. అదే విధంగా నగరంలోని వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి, పద్మాక్షి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. కాకతీయ ఆలయాల శిల్పకళను పరిశీలించారు. వరంగల్ కోట, వరంగల్ ఎన్ఐటీలను సందర్శించి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హనుమకొండ రెడ్‌క్రాస్‌ను సందర్శించి తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా అదనపు బ్లాక్‌ను ప్రారంభించారు. రెడ్‌క్రాస్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వరంగల్ నగరం సుస్థిర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. లక్నవరం సరస్సులో బోటింగ్మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో బసచేసిన గవర్నర్ బుధవారం ఉదయం సరస్సులో మంత్రి సీతక్క, అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. సరస్సు అంతా కలియదిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. -
తిరుమలలో ముగిసిన జ్యేష్ఠాభిషేకం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామి బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకంవరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తం గా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామికి, దేవేరులకు శతకలశ తిరుమంజనం జరిపారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, జేఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు. నేడు పౌర్ణమి గరుడసేవ: తిరుమలలో పౌర్ణమి సందర్భంగా శనివారం గరుడ సేవ జరుగనుంది. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. -
ముఖ్యమంత్రా.. చెడ్డీగ్యాంగ్ లీడరా?
పటాన్‌చెరుటౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటతీరు చూస్తుంటే ముఖ్యమంత్రా..? లేక చడ్డీగ్యాంగ్ లీడరా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో గణేశ్‌గడ్డ దేవస్థానం వద్ద ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరితే.. ‘చడ్డీ విప్పుతా.. డ్రాయర్ విప్పుతా’ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఇదేం భాషో అర్థం కావడం లేదన్నారు. రేవంత్ భాషను ప్రజలు గమనిస్తున్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, కానీ, ఆ ఆటలు సాగవని..మెదక్ గడ్డ బీఆర్ఎస్కు అడ్డా అని చెప్పారు. -
Om Singh Rathore: బుల్లెట్ బాబా టెంపుల్
మన దేశంలో జాతీయ రహదారుల పక్కన ఆలయాలు కనిపిస్తుంటాయి. అయితే జోద్పూర్–అహ్మదాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆలయం మాత్రం ఆసక్తికరం. ఆదిత్య కొంద్వార్ అనే రచయిత ఈ ఆలయానికి సంబంధించి విషయాలను ‘ఎక్స్’లో షేర్ చేశాడు. చాలా సంవత్సరాల క్రితం...‘బుల్లెట్ బాబా’ గా పిలుచుకొనే ఓమ్ సింగ్ రాథోడ్ నడుపుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. బైక్‌ను పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. అయితే మరుసటి రోజు ఈ బైక్ కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయేలా ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. దీంతో స్థానికులు ఈ ‘బుల్లెట్ బైక్’కు పూజలు చేయడం మొదలుపెట్టారు. తరువాత ఒక ఆలయాన్ని కట్టి ఈ బుల్లెట్ బైక్‌ను విగ్రహంలా ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఇది ‘బుల్లెట్ బాబా టెంపుల్’గా ప్రసిద్ధి పొందింది. రోడ్డుపై ప్రయాణం చేసేవారు ఈ ఆలయం దగ్గర ఆగి ‘ఎలాంటి ప్రమాదం జరగకూడదు’ అని మొక్కుకుంటూ వెళుతుంటారు. -
సీఎం కుర్చీలో రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో లాంఛనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రం 4.20 గంటలకు సతీమణితో కలసి సచివాలయానికి చేరుకున్న రేవంత్‌కు.. ప్రధానద్వారం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పలువురు ఉన్నతాధికారులు పోలీసు అధికార బ్యాండ్ మోగుతుండగా ఘనంగా స్వాగతం పలికారు. రేవంత్ అక్కడి నుంచి నడుచుకుంటూనే సచివాలయం లోపలికి వెళ్లారు. సీఎం చాంబర్ వద్ద ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత సతీమణి గీతతో కలసి రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 4.46 నిమిషాలకు ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో ఆసీనులయ్యారు. సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతిధులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సచివాలయంలోనే రేవంత్ అధ్యక్షతన నూతన మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది. తెరుచుకున్న సచివాలయం ద్వారాలు రాష్ట్ర నూతన సచివాలయం ద్వారాలు గురువారం ప్రజలందరి కోసం తెరుచుకున్నాయి. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక సచివాలయానికి వస్తారని తెలియడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సచివాలయానికి చేరుకున్నారు. అధికారులు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలకు పాస్‌లు ఇచ్చి లోపలికి అనుమతించారు. దీంతో సచివాలయం లోపల సందడి కనిపించింది. తొలిసారిగా జర్నలిస్టులను పాస్‌ల అవసరం లేకుండా మీడియా గుర్తింపు కార్డులు చూసి కొత్త సచివాలయంలోకి అనుమతించారు. గతంలో సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయడం, ప్రధాన భవనం లోపలే మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించడంపై మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
ఈ కొండ గట్టెక్కిస్తుందని..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సంప్రదాయం. అందులోనూ ఏదైనా మంచిపని చేసేముందు.. కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగువారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే.. కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు. కొండగట్టు అంటే సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు. ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు. ఎంపీ అయిన తర్వాత కూడా పలుమార్లు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. 2019లో ఎంపీగా గెలవకముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్, కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు. ఈనెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూలులో లేనప్పటికీ, రాహుల్‌గాం«దీని కొండగట్టు వద్ద ఆపి, పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు. -
ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తిలో ని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపీనాథ్ మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా, స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆర్కే గ్రూప్స్ అధినేత పద్మశ్రీ డాక్టర్ రవి పిళ్లై, సుమారు 20 మంది రష్యా దేశస్థులు కూడా ఉన్నారు. -
నగ్నంగా పూజలు చేస్తే డబ్బులంటూ మోసం.. 12 మంది అరెస్ట్
గుంటూరు రూరల్: డబ్బు ఆశ చూపి యువతుల్ని మోసగించేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాడి ఆగడాలకు దిశ యాప్ సాయంతో అడ్డుకట్ట పడింది. బాధిత యువతులు తమ మొబైల్ ఫోన్లోని దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువతులను రక్షించారు. వారిచ్చి న సమాచారం ఆధారంగా అఘాయిత్యాలకు పాల్పడిన 12 మందిని నల్లపాడు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ మహబూబ్‌బాషా కథనం ప్రకారం.. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు అనే వ్యక్తి బోర్లు వేసే సమయంలో కొబ్బరి కాయలతో నీరు పడుతుందో లేదో చెప్పే పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే గుప్త నిధులను వెతికేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన వి.నాగేంద్రబాబుకు నగ్నంగా పూజలు చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని ఆశ చూపాడు. దీంతో నాగేంద్రబాబు తన క్లాస్మేట్ అయిన కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలకు చెందిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలకు ఒకసారి నగ్నంగా పూజలో కూర్చునే మహిళలు ఉంటే వారికి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పాడు. దీంతో సురేష్, ఖాశిం, పెద్దరెడ్డి ఇద్దరు యువతులతో గత మంగళవారం గుంటూరు వచ్చి నాగేంద్రబాబును కలిశారు. ఈ విషయాన్ని నాగేంద్రబాబు పూజారి నాగేశ్వరరావుకు ఫోన్లో చెప్పాడు. దీంతో నాగేశ్వరరావు అనుచరులు, అతడి కారు డ్రైవర్ సునిల్, చిలకలూరిపేటకు చెందిన ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే అరవిందచౌదరి, సుబ్బు, శివ, రాధ గుంటూరు బస్టాండ్‌కు వెళ్లి నంద్యాల నుంచి వచ్చిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలను కలిసి.. డబ్బుల విషయమై మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చారు. కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించి.. మంగళవారం రాత్రి పూజలు ప్రారంభించాలని నాగేశ్వరరావు చెప్పగా.. వారంతా తాడికొండ మండలం పొన్నెకల్లులోని నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత నాగేశ్వరరావు యువతులను ఓ గదిలో నగ్నంగా కూర్చోబెట్టి పూజలు ప్రారంభించాడు. మధ్యలో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూజ చేస్తున్న సమయంలో కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో యువతులు ఏమీ చేయలేకపోయారు. పూజలు ముగిసిన అనంతరం నాగేశ్వరరావు, అతని అనుచరులు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బుధవారం నాడు పొన్నెకల్లులో పూజలు కుదరటం లేదని చిలకలూరిపేటలోని పండరీపురంలో అరవిందచౌదరి ఇంట్లో పూజలు చేయాలని నిర్ణయించాడు నాగేశ్వరరావు. బుధవారం రాత్రి అందరూ కలిసి చిలకలూరిపేట వెళ్లారు. శుక్రవారం వరకూ పూజలు చేసే క్రమంలో యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజులుగా పూజలు చేస్తున్నా ఫలితం లేకపోవటంతో నాగేశ్వరరావు అక్కడినుంచి జారుకున్నాడు. దిశ యాప్‌ను ఆశ్రయించడంతో.. ఈ క్రమంలో సదరు యువతులు ఒప్పందం ప్రకారం తమకు డబ్బు ఇస్తే ఇంటికిపోతామని నాగేశ్వరరావు అనుచరులను అడిగారు. దీంతో నాగేశ్వరరావు అనుచరులకు, యువతులకు వివాదం తలెత్తింది. ఈ విషయాన్ని అరవిందచౌదరి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పగా.. తన ఇంటికి వస్తే సెటిల్మెంట్ చేసుకుందామని నాగేశ్వరరావు సూచించాడు. అందరూ కారులో పొన్నెకల్లు బయలుదేరారు. మధ్యలో నాగేశ్వరరావు అనుచరులు యువతులను బెదిరించడంతో గోరంట్ల సమీపంలో బాధిత యువతులు తమ వద్దనున్న సెల్ఫోన్లో దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో వెంటనే స్పందించిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ నేతృత్వంలో నల్లపాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే నగర శివార్లలోని గోరంట్ల వద్ద ఉన్న యువతుల చెంతకు చేరుకుని ఆమెతోపాటున్న అరవింద చౌదరి, నాగేంద్రబాబు, సునిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు జరిగిన విషయాన్ని ఒప్పుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, అరవింద చౌదరి, రాధ, భాస్కర్, పెద్దరెడ్డి, సాగర్, వెంకటసురేష్, శివ, సునీల్, పవన్, సుబ్బులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరు ఉన్నారని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మహబూబ్‌బాషా చెప్పారు. ఎవరైనా డబ్బు ఆశచూపి యువతులు, మహిళలకు ఎరవేస్తే నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కోరారు. -
‘మహాయజ్ఞం’లో ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: సనాతన ధర్మాలను గౌరవిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు కొనసాగనున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమైంది. ‘సమస్త ప్రజానాం క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య, ఐశ్వర్య అభివృద్ధ్యర్థం...’ అంటూ సీఎం వైఎస్ జగన్ వేద పండితుల ఉచ్చారణల మధ్య సంకల్పం చేపట్టడంతో యజ్ఞ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి దంపతులతో పాటు వారి పిల్లల గోత్ర నామాలతో వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞశాలలో ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ మహాలక్ష్మీ దేవి విగ్రహం ముందు స్వర్ణలక్ష్మీ అమ్మవారి ప్రతిమకు సీఎం జగన్ పంచామృతాలతో అభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహానికి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రికి కుర్తాళం శ్రీసిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆశీర్వచనం అందజేశారు. కపిల గోవుకు పూజలు యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వివిధ ఆగమాలకు అనుగుణంగా యజ్ఞశాల చుట్టూ కలియ తిరిగిన సీఎం జగన్ వేద పండితులు, రుత్వికులకు అభివాదం చేశారు. గోశాలలో కపిల గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో భక్తులను పలుకరించి మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దంపతులు యజ్ఞ దీక్షాధారణ స్వీకరించారు. మంత్రులు తానేటి వనిత, ఉషశ్రీచరణ్, జోగి రమేష్, అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నెల 17 వరకు యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతాయి. -
ఒంటిమిట్టలో వేడుకగా ధ్వజారోహణ
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. తొలుత శాస్త్రోక్తంగా హోమం, పూజలు నిర్వహించిన వేదపండితులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభంపై గ రుడ పతాకాన్ని ఎగురవేశారు. ధ్వజస్తంభానికి నవకళ పంచామృతాభిషే కం చేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, ధ్వజస్తంభ రక్షాబంధనం, ఆరాధన చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో నటే‹Ùబాబు ఆధ్వర్యంలో సతీసమేతంగా రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కె.హెచ్.రాజేష్ సంప్రదాయబద్ధంగా ఉత్సవాన్ని నిర్వహించారు. నేటి కార్యక్రమాలు: శ్రీకోదండరామాలయంలో శనివారం ఉదయం 7:30 గంటలకు వేణుగానాలంకారం ఉంటుంది. రాత్రికి కోదండరాముడు హంసవాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించనున్నారు. -
యూపీలో యోగికి గుడి
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు యూపీలోని భరత్కుండ్కు చెందిన ప్రభాకర్మౌర్య అనే వీరాభిమాని గుడి కట్టాడు. యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కాషాయ వస్త్రాలు, విల్లంబులతో దేవతల మాదిరిగా తల వెనుక వెలుగులతో ఏర్పాటు చేశాడు. రోజుకు రెండు సార్లు పూజలు చేసి, భక్తులకు ప్రసాదం పంచిపెడుతున్నాడు. ఫైజాబాద్–ప్రయాగ్‌రాజ్ హైవే పక్కనే భరత్‌కుండ్ ఉంది. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్‌కుండ్ రామాయణ కాలంలో అరణ్యవాసం వెళ్లే శ్రీరాముడికి ఆయన సోదరుడు భరతుడు వీడ్కోలు పలికిన చోటుగా ప్రసిద్ధి. యోగి కార్యక్రమాలతో ప్రభావితమై ఆయనకు గుడి కట్టినట్లు మౌర్య తెలిపాడు. -
కృష్ణా...ముకుందా...మురారి
కడప కల్చరల్: శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలను గురువారం కడప నగరం ద్వారకానగర్‌లోని శ్రీ మురళీకృష్ణాలయంలో ఘనంగా నిర్వహించారు. అర్చక బృందం ఈ సందర్భంగా మూలమూర్తికి విశేష అభిషేకాలు, అనంతరం కనుల పండువగా అలంకారం చేశారు. ఆలయం నిర్వాహకులు రామమునిరెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులందరికీ నిబంధనల మేరకు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధ్యాన మందిరంలో ఉత్పవమూర్తిని నిలిపి ఆయనతోపాటు గణపతి సచ్చిదానంద స్వామి మూర్తికి కూడా పూజలు చేశారు. రాయచోటి రైల్వేగేటు వద్దగల శ్రీకృష్ణాలయంలో కూడా కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. కృష్ణయ్యకు పూజలు కడప నగర సమీపంలోని అప్పరాజుపల్లె గ్రామంలో గురువారం కృష్ణునికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ అమర్నాథ్ యాదవ్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. రేపు కృష్ణాష్టమి పూజలు కడప నగరం గడ్డిబజారులోని శ్రీ లక్ష్మి సత్యానారాయణస్వామి ఆలయంలో శనివారం శ్రీకృష్ణ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విజయ్‌భట్టర్ తెలిపారు. శ్రీకృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్రం ప్రకారం ఈ కార్యక్రమాన్ని శనివారం పంచారాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో సందడి కృష్ణాష్టమి ముందస్తు వేడుకల్లో భాగంగా కడప నగరానికి చెందిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో గురువారం రాధాకృష్ణులుగా చిన్నారులు సందడి చేశారు. చిన్నికృష్ణులు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్న ఆ చిన్నారులను రిమ్స్ వైద్యులు అర్చన అభినందించారు. అనంతరం చిన్ని కృష్ణులతో కృష్ణయ్యకు ప్రార్థనలు నిర్వహించారు. భగవద్గీతా పఠనం చేయించారు. పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహ భరితంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు స్వీట్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ హరికృష్ణ, సిబ్బంది సరస్వతి, సంధ్యారెడ్డి, వైశాలి, లక్ష్మిదేవి, భార్గవి, మేరి, పీఈటీ జయచంద్ర, జవహర్, లక్ష్మయ్య, శంకర్ పాల్గొన్నారు. దీంతో పాటు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. అలరించిన నృత్యాలు కడప కల్చరల్ : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని స్థానిక ద్వారకానగర్లోగల శ్రీ మురళీ కృష్ణాలయం ప్రాంగణంలో పలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప స్పందన డాన్స్ అకాడమీ చిన్నారులు చేసిన నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విన్నావ.. యశోదమ్మ, భరత వేదమున, జయజయహే మహిశాసుర మర్ధిని వంటి నృత్యాలు అలరించాయి. ప్రజలు కరతాళ ధ్వనులతో చిన్నారులను ప్రోత్సహించారు. ముద్దులొలికే చిన్నికృష్ణయ్యలు శ్రీకృష్ణాష్టమి సందర్బంగా చిన్నారులు ఉన్న ఇళ్లలో చిన్ని కృష్ణయ్యలుగా దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారి పాపలకు చిన్నారి కృష్ణయ్య వేషాలను ధరింపజేసి తమ కంటి పాపల నిండుగా తనివి తీరాచూసుకుని మురిసిపోతున్నారు. పనిలో పనిగా గోపెమ్మలను కూడా సిద్ధం చేసి వెన్న తినిపించే ఘట్టాలను, ఉట్టికొట్టే ఘట్టాలను నిర్వహించి ముచ్చట తీర్చుకుంటున్నారు. పనిలో పనిగా మనోళ్లు మన జిల్లాకు మత సామరస్యంగా గల ఘనతను మరోమారు చాటారు. ఈ సందర్బంగా పలువురు ముస్లింలు కూడా తమ చిన్నారులకు కృష్ణుడి వేషాలు ధరింపజేసి మతాలకు అతీతంగా నిలిచి ఆనందాన్ని ఆస్వాదించారు. -
దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని..
కొత్తపల్లి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి ఏడాది మాదిరిగానే కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో పోలేరమ్మ తీర్థంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గురువారం ఉదయం దున్నపోతును తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానిని గరగ నృత్యాల మధ్య గ్రామమంతా ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా నేలపై వరుసగా పడుకున్నారు. వారి మీదుగా దున్నపోతును నడిపించారు. ఓ భక్తురాలు కూడా వీరిని తొక్కుకుంటూ ముందుకు సాగింది. అలా మూడుసార్లు భక్తులు దున్నపోతుతో తొక్కించుకున్నారు. ఇలా తొక్కించుకోవడం వలన వల్ల గ్రామానికి ఉన్న అరిష్టం పోవడంతో పాటు తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గతంలో ఈ దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు అలా చేయకుండా పూజల అనంతరం విడిచి పెట్టేస్తున్నారు. -
మహాఘట్టానికి తొలి అడుగు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర ఘట్టానికి మండమెలిగె పండుగతో తొలి అడుగు పడింది. జాతరకు వారం రోజుల ముందు బుధవారం మండమెలిగె పండుగ ఘనంగా జరిగింది. సమ్మక్క ప్రధాన పూజా రి సిద్ధబోయిన మునీందర్ ఇంటినుంచి అచారం ప్రకారం పసుపు, కుంకుమ పూజాసామగ్రిని సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. మరో పూజారి లక్ష్మణ్‌రావు ఇంటి నుంచి మామిడి తోరణాలు తీసుకువచ్చారు. ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పూజారులు మేడారం గ్రామ శివారులోని మైసమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడినుంచి బొడ్రాయి వద్దకు వెళ్లి పవిత్రజలంతో శుద్ధి చేశారు. సమ్మక్క గుడి ముందు ఆడపడచులు ముగ్గు లు వేసి అలకరించారు. మామిడి తోరణాలకు ఉల్లిగడ్డ, కోడిపిల్లలను కట్టి (దిష్టి తగలకుండా) దొర స్తంభాన్ని నిలిపారు. కల్లు (సాక), నీళ్లు, పాలు, బెల్లం పానకం, నెయ్యి, చలి గంజితో రోడ్డుకు అడ్డంగా ఆరగింపు చేశారు. అనంతరం గ్రామ శివారులో మరో దొర స్తంభాన్ని నిలిపారు. ప్రధాన పూజారి (వడ్డె) కొక్కరి కృష్ణయ్య పసుపు, కుంకుమలతో అమ్మవారిని గద్దెలపైకి తీసుకువెళ్లారు. బు«ధవారం రాత్రి అక్కడే జాగారం చేసి గురువారం గుడి చేరుకోనున్నారు. అదేసమయంలో కన్నెపల్లిలో సారలమ్మ ఆలయంలో కాక వంశస్తుల ఆధ్వర్యంలో మండమెలిగె పండుగ, పోను గొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో గుడిమెలిగె కార్యక్రమాన్ని నిర్వహించారు. మండమెలిగె పండుగ సందర్భంగా మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
కొత్త కోడళ్ల బేటింగ్
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా సోమవారం అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబాకు అభిషేకం చేశారు. మహా పూజ నిర్వహించారు. అనంతరం బస చేసిన గోవడ్ నుంచి సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకుని రాత్రి 1 గంట నుంచి మంగళవారం వేకువజాము 4 గంటల వరకు మెస్రం వంశంలోని 72 మంది కొత్త కోడళ్లకు బేటింగ్ (పరిచయ) కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు కొత్త కోడళ్లు నాగోబా ఆలయం పక్కనే ఉన్న సతీ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. బేటింగ్ అనంతరం కొత్త కోడళ్లు మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. జాతర ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
శ్రావణ శోభ
నెల్లూరు(బృందావనం): శ్రావణమాస తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని నగరంలోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో పూజలను నిర్వహించి నోములను ఆచరించారు. ఆలయాల్లో భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గీ నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారికి లక్షకుంకుమార్చనను విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో కుప్చచ్చి సుబ్బారావు, ఆలూరు శిరోమణిశర్మ పర్యవేక్షణలో 20 మంది రుత్విక్కులతో కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ మండపంలో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం విశేషహారతులు, రాత్రి అమ్మవారికి పల్లకీసేవ కనులపండువగా జరిగింది. తీర్థప్రసాదాలకు ఉభయకర్తలుగా సోమవారపు సూర్యనారాయణరావు, విజయలక్ష్మి దంపతులు, గంగాభవాని, మధుకర్ వ్యవహరించారు. ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి, దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్ పర్యవేక్షించారు. రాజరాజేశ్వరి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి శివశంకరరావు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి విశేషపూజలను నిర్వహించారు. రాత్రి పల్లకీసేవ, ఊంజల్‌సేవను వేడుకగా జరిపారు. ఆలయ అర్చకులు బాలాజీశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, శ్రీశైలం భార్గవశర్మ, ధూర్జటి వేణుగోపాలశర్మ, తదితరుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఉభయకర్తలుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు వ్యవహరించారు. ఈఓ ఆరంబాకం వేణుగోపాల్ పర్యవేక్షించారు. మూలాపేటలోని ఇరుకళల పరమేశ్వరి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన నిర్వహిం చారు. ఉభయకర్తలుగా సూర్యప్రకాశ్‌రావు, విజయశ్రీ దంపతులు వ్యవహరించారు. అమ్మవారికి సాయంత్రం పూలంగిసేవ, చందనా లంకారం, రాత్రి పల్లకీసేవను నిర్వహించారు. ఉభయకర్తలుగా రాజేశ్వరరావు, అరుణ దంపతులు వ్యవహరించారు. ఈఓ వేమూరి గోపీ పర్యవేక్షించారు. పప్పులవీధిలోని మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారికి క్షీరాభిషేకం, రాత్రి ఊంజల్‌సేవను నిర్వహించారు. ఈఓ గుమ్మినేని రామకృష్ణ పర్యవేక్షించారు. -
ఆదాయంపై ఉన్న శ్రద్ధ పూజలపై లేదు
– దేవాదాయ శాఖ తీరుపై స్వరూపానందేంద్ర సరస్వతి ధ్వజం పాలకొల్లు సెంట్రల్ : దేవాదాయ శాఖ అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ ఆలయాల్లో చేయాల్సిన పూజలపై లేదని విశాఖలోని శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన మహా కుంభాభిషేకం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్వరూపానందేంద్ర మాట్లాడుతూ పంచారామ క్షేత్రాల్లో కుంభాభిషేకాలు చేయాలని ఆగమ శాస్త్రం చెబుతున్నా దేవాదాయ శాఖకు ఆ ఆలోచనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి సొమ్మును దేవుడికి ఖర్చు చేయడానికి వీళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. తమిళనాడులోని ప్రతి ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా కుంభాభిషేకం నిర్వహిస్తారన్నారు. దీనివల్ల ఆలయానికి ఉన్న దోషాలు పోయి గర్భాలయంలోని విగ్రహానికి మంచి శక్తి వస్తుందన్నారు. కలశాల్లో జలాలను పోసి మూడు, ఐదు రోజులు మంత్రోచ్ఛారణ చేసి ఆ జలాలతో అభిషేకం చేస్తే ఏడు జన్మల సహస్ర పాపాలను తొలగించినట్టు అవుతుందన్నారు. కుంభాభిషేకానికి అంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు. -
కొమురవెల్లిలో భక్తుల సందడి
చేర్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొం ది. ఆదివారం తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. అలా గే ఆలయంలోని గంగిరేగు చెట్టు కింద పట్నాలు వేసి, స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, కొంత మంది భక్తులు శ్రీమల్లికార్జునస్వామి, బలిజమేడలాదేవికి, గొల్లకేతమ్మకు ఓడిబియ్యం పోశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారిని దర్శిం చుకునేందుకు సుమారు గంట సమయం పట్టింది. ఇదిలా ఉండగా, ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
అప్పన్న సేవలో ఐజీ
సింహాచలం : ఇంటెలిజెన్స్ ఐజీ చంద్రశేఖరరావు వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనంచేసుకుని అంతరాలయంలో పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆయన కుటుం బానికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ అందజేశారు. -
వ్యక్తి పూజలకు కొత్త మంత్రాలు!
అక్షర తూణీరం మనకి దేవుళ్లకేం కొదవలేదు. కాని రాముడంటే మనందరికీ మహాయిష్టం. ఆయన దగ్గర చనువు. సాటివాడు కదా, గోడు వింటాడని నమ్మకం. మనిషి పెద్ద మాయగాడు. అవసరాలను బట్టి మనిషిని దేవుణ్ణి చేస్తాడు. ఆ దేవుడి చుట్టూ అభేద్యమైన గూడు అల్లుతాడు. ఆ దేవుడికి శతనా మావళులు, సహస్ర నామావళులు రచిస్తాడు. గూటికి గట్టి తలుపులు ఏర్పాటు చేసి, బయట ఓ జేగంట ఏర్పాటు చేస్తాడు. నేన్నిన్ను స్తుతిస్తూ మేల్కొలుపులు పాడతాను, అంతవరకూ నువ్ నిద్ర లేవరాదని భక్తిగా దేవుణ్ణి శాసిస్తాడు. ఎంతైనా దేవుళ్లలో మానవాంశ అంతో ఇంతో ఉంటుంది కదా! అందుకని పొగడ్తలకు మెత్తబడతారు. చెవికింపైన అతిశయోక్తులు వల్లిస్తూ, ‘రామ! రామ! ఇవి సహజోక్తుల’ని వినయం ఒలకబోస్తే నల్లశిల అయినా మెత్తబడాల్సిందే. ఒక్కో తెలివి మీరిన భక్తుడు చిత్రంగా నిందాస్తుతులు, స్తుతినిందలు చేసేసి చక్కిలిగింతలు పెట్టేస్తాడు. అప్పుడు మూల విరాట్ తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. నల్లరాతి బుగ్గలు ఎరుపెక్కుతాయి. ‘‘మహా సృష్టిలో మనిషిని తయారుచేసి పప్పులో కాలేశానని నిత్యం పలుమార్లు సృష్టికర్త నాలుక్కరుచుకుంటాడట’’. కానీ వేసిన అడుగు వెనక్కి తీసుకోలేక సతమతమవుతూ ఉంటాడు. పూజల పేరిట చెవిలో పువ్వులేమిటి? లేకపోతే దేవుళ్లకి పూజలేమిటి? సరే, పెళ్లిళ్లేమిటి? పట్టాభిషేకాలేమిటి? ఉత్సవాల పేరిట వసూళ్లే మిటి? అందులో కైంకర్యా లేమిటి? ఇంత జరుగుతున్నా బొమ్మలా ఉండిపోయానే అని దేవుడు సుప్రభాతానికి ముందు లేచి అప్పుడప్పుడు వర్రీ అవుతూ ఉంటాడు. ఇతిహాసాలలో, మన ప్రబంధాలలో, కొన్ని నాటకాలలో, నవలల్లో పాత్రలు కవితో సృష్టించబడతాయి. ఒక్కోసారి అవి తెలివిమీరి సృష్టికర్త అదుపు తప్పుతాయి. ఎదురు శాసించడం మొదలుపెడతాయి. శ్రీరామనవమి పేరు చెప్పుకుని వడపప్పు, పానకాలు సేవించి తరించింది జాతి. భక్తిని నిషాగా ఎక్కించగల ప్రత్యేక మానవులు మనలోనే ఉన్నారు. మనిషిని దేవుణ్ణి చేసి గుడి కట్టినప్పుడు, ఆ మనిషి ఆదర్శాలన్నీ గుడి పునాదిరాళ్లు అవుతాయి. అక్కడ నుంచి గుడి తాలూకు ధర్మకర్తల జగన్నాటకానికి తెరలేస్తుంది. ఇంతకీ విగ్రహంగా నిలిచిన నిన్నటి మనీషి ఏమి హితం చెప్పాడో వినిపించుకోరు. పెద్దగా శంఖాలు ఊదుతూ, మంత్రాలు చదువుతూ హితాలు, ఆదర్శాలు చెవిన పడనియ్యరు. ఇక జనానికి కనిపించేవి- బొమ్మకి క్షీరాభిషేకాలు, సమయానికి తగుదండలు మాత్రమే. అంబేడ్కర్ స్ఫూర్తిని పంచడం శ్రేయోదాయకమే గాని ఆకాశాన్ని ముద్దాడే స్థాయి విగ్రహం ఆ మహనీయుని ఆత్మకు సంతృప్తిని ఇస్తుందా? పులిని చూసి నక్క వాత అన్నట్టు, ఇప్పుడు అమరావతిలో ఇంకో అంగుష్ఠమాత్రం ఎత్తయిన విగ్రహం అవతరించబోతోంది. పీఠం ఎక్కి రెండేళ్లయాక అసలు అంబేడ్కర్ చలవతోనే నేను ప్రధాని పీఠం ఎక్కానంటూ మోదీ గద్గదస్వరంతో ప్రకటించారు. శిలావిగ్రహాలు, వాటికి పూజలు వద్దు. రాముడి ఆదర్శం ఒక్కటి ఆచరణలో పెడదాం. ఆకాశమెత్తు అంబేడ్కర్ బొమ్మలొద్దు. బాబాసాహెబ్ ఒక్కమాటని అనుసరిద్దాం. వ్యక్తి పూజలకు కొత్త మంత్రాల రచన వద్దు. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)