
మన దేశంలో జాతీయ రహదారుల పక్కన ఆలయాలు కనిపిస్తుంటాయి. అయితే జోద్‌పూర్–అహ్మదాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆలయం మాత్రం ఆసక్తికరం. ఆదిత్య కొంద్వార్ అనే రచయిత ఈ ఆలయానికి సంబంధించి విషయాలను ‘ఎక్స్’లో షేర్ చేశాడు. చాలా సంవత్సరాల క్రితం...‘బుల్లెట్ బాబా’ గా పిలుచుకొనే ఓమ్ సింగ్ రాథోడ్ నడుపుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.
బైక్‌ను పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. అయితే మరుసటి రోజు ఈ బైక్ కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయేలా ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. దీంతో స్థానికులు ఈ ‘బుల్లెట్ బైక్’కు పూజలు చేయడం మొదలుపెట్టారు. తరువాత ఒక ఆలయాన్ని కట్టి ఈ బుల్లెట్ బైక్‌ను విగ్రహంలా ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఇది ‘బుల్లెట్ బాబా టెంపుల్’గా ప్రసిద్ధి పొందింది. రోడ్డుపై ప్రయాణం చేసేవారు ఈ ఆలయం దగ్గర ఆగి ‘ఎలాంటి ప్రమాదం జరగకూడదు’ అని మొక్కుకుంటూ వెళుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment