ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. తొలుత శాస్త్రోక్తంగా హోమం, పూజలు నిర్వహించిన వేదపండితులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభంపై గ రుడ పతాకాన్ని ఎగురవేశారు. ధ్వజస్తంభానికి నవకళ పంచామృతాభిషే కం చేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, ధ్వజస్తంభ రక్షాబంధనం, ఆరాధన చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో నటే‹Ùబాబు ఆధ్వర్యంలో సతీసమేతంగా రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కె.హెచ్.రాజేష్ సంప్రదాయబద్ధంగా ఉత్సవాన్ని నిర్వహించారు.
నేటి కార్యక్రమాలు: శ్రీకోదండరామాలయంలో శనివారం ఉదయం 7:30 గంటలకు వేణుగానాలంకారం ఉంటుంది. రాత్రికి కోదండరాముడు హంసవాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment